సీపీడబ్ల్యూఎస్‌ పునరుద్ధరిస్తాం | - | Sakshi
Sakshi News home page

సీపీడబ్ల్యూఎస్‌ పునరుద్ధరిస్తాం

Nov 13 2026 12:40 AM | Updated on Nov 13 2026 12:40 AM

● పరిశీలించిన అధికారులు

ఇల్లంతకుంట: 2019లో నిలిచిపోయిన సీపీడబ్ల్యూఎస్‌ రక్షిత తాగునీటి పథకాన్ని పునరుద్ధరించడానికి మిషన్‌ భగీరథ చీఫ్‌ ఇంజినీర్‌ జ్ఞానకుమార్‌ గురువారం పరిశీలించారు. మానేరువాగులోని ఇన్‌టేక్‌ వెల్‌ను పరిశీలించారు. సూ పర్‌ ఎల్‌నినో ప్రభావంతో మిషన్‌ భగీరథలో నీటిసమస్య తలెత్తినప్పుడు సీపీడబ్ల్యూఎస్‌ పథకాన్ని వినియోగించుకు పరిశీలించినట్లు ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. 2007లో ప్రారంభమైన సమగ్ర రక్షిత తాగునీటి పథకం ఇల్లంతకుంట మండలంలోని 24 గ్రామాలకు తాగునీ టిని అందించేది. ఇన్‌టేక్‌ వెల్‌ వద్ద వెంటిలేటర్లు రిపేర్లు ఉన్నాయని, ప్యానెల్‌బోర్డు కూడా రిపేర్‌లో ఉందని, కొంతమేర పైపులైన్‌ మరమ్మతు దశలో ఉందని అధికారులు గుర్తించారు. మో టార్లను రన్‌ చేస్తే గాలిపల్లి, ముస్కానిపేట, గొల్లపల్లి, పంపుహౌస్‌ల మోటార్లను నడిపిస్తే వాటి స్థితిగతులు తెలుస్తాయన్నారు. మిషన్‌ భ గీరథ చీఫ్‌ ఇంజినీర్‌ జ్ఞానకుమార్‌, ఎస్‌ఈ రా ములు, ఈఈ సుమలత, డిప్యూటీ ఈఈ ప్రసాద్‌ పాల్గొన్నారు.

ఆరుతడి పంటలు వేయండి

కోనరావుపేట: రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ కోరారు. మండలంలోని సుద్దాలలో కావేరి ఇండస్ట్రీస్‌లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించి మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తక్కువ అవుతోందని, వినియోగం పెరిగిపోతుందన్నారు. రాష్ట్రంలోని రేషన్‌ వినియోగదారులకు ఏడాది పొడవునా సరఫరా చేయడానికి అవసరమైన ధాన్యం నిల్వలు గోదాముల్లో ఉన్నాయన్నారు. పామాయిల్‌ను ప్రతీ ఉత్పత్తిలో వినియోగిస్తుండడంతో డిమాండ్‌ ఉందని.. రైతులు ఆయిల్‌పామ్‌ సాగు చేయాలన్నారు. సింగిల్‌విండో చైర్మన్లు బొమ్మెన భాస్కర్‌రావు, చేపూరి గంగాధర్‌, ఆత్మకమిటీ చైర్మన్‌ ముకుందరెడ్డి, గ్రంథాలయ చైర్మ న్‌ నాగుల సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్‌ ఎల్ల య్య, సెక్రెటరీ సరోజ, డీఎంవో ప్రకాశ్‌, తహసీ ల్దార్‌ వరలక్ష్మి, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానుక స త్యం, సింగిల్‌విండో మాజీ చైర్మన్‌ బండ నర్స య్య, రాజేందర్‌, చంద్రయ్య పాల్గొన్నారు.

జాతీయస్థాయి ఎస్జీఎఫ్‌ క్రికెట్‌ టీమ్‌ కోచ్‌గా డేవిడ్సన్‌

సిరిసిల్ల అర్బన్‌: సిరిసిల్లకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు ఎల్‌.డేవిడ్సన్‌, కుంట శ్రీనివా స్‌ జాతీయ స్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌–17 బా లికల క్రికెట్‌ టీమ్‌కు సేవలందించనున్నారు. ఈ నెల 15 నుంచి 22 వరకు జమ్మూకశ్మీర్‌లో జరిగే 70వ జాతీయ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌లో డేవిడ్స న్‌ బాలికల జట్టు కోచ్‌గా, కుంట శ్రీనివాస్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు.

లింగ నిర్ధారణ నేరం

సిరిసిల్ల: గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు అరికట్టేందుకు పీసీపీఎన్‌డీటీ చట్టం అమలు చేయాలని డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్‌ కోరా రు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో గురువారం పీసీపీఎన్‌డీటీ సలహా కమిటీ సమావేశం జరిగింది. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ స్కానింగ్‌ కేంద్రాలు నిబంధనలు పాటించాలని ఆదేశించారు. పీసీపీఎన్‌డీటీ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, స్కానింగ్‌ పరీక్షల ధరలు, వైద్యుల పేర్లు, అర్హతలు స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు.

మాతృ మరణాలపై సమీక్ష

తంగళ్లపల్లి మండలం నేరెళ్ల పీహెచ్‌సీ పరిధిలో నమోదైన మాతృమరణ కేసును కమిటీ సమీక్షించింది. కమిటీ సభ్యులు మాట్లాడుతూ గర్భిణీలను గర్భధారణ ప్రారంభ దశలోనే నమోదు చేయాలన్నారు. వైద్యుల సూచనలతో ఐరన్‌, పోలిక్‌ యాసిడ్‌ మాత్రలు తప్పకుండా వినియోగించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో, ప్రోగ్రాం ఆఫీసర్‌ నాగేంద్రబాబు, జిల్లా జనరల్‌ ఆస్పత్రి గైనకాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ ఎం.సుగుణ, వేములవాడ సివిల్‌ సర్జన్‌ సంగీతారెడ్డి, పిల్లల డాక్టర్‌ పరమేశ్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రజనీకాంత్‌, ఐఎంఏ అధ్యక్షుడు చీకోటి సంతోష్‌కుమార్‌, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్‌, జిల్లా డిప్యూటీ మాస్‌ మీడియా అధికారి ప్రసాద్‌, వైద్యాధికారి చంద్రిక పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement