కోనరావుపేట: గ్రామంలో చేపడుతున్న భూసర్వేను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. మండలంలోని మల్కపేటలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సమాచారం అందించి, వారి సమక్షంలో భూముల రీ సర్వే ప్రక్రియ చేపట్టాలని, రోజూవారీగా లక్ష్యం నిర్దేశించుకుని దానికి అనుగుణంగా రీ సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులన్నారు. ఆయన వెంట తహసీల్దార్ వరలక్ష్మి, నాయబ్ తహసీల్దార్ ప్రవీణ్, డీఐ రాజేంద్ర ప్రసాద్, సర్వేయర్, తదితరులు ఉన్నారు.


