● వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు
వేములవాడ: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పేర్కొన్నారు. సర్‌లో భాగంగా ఓటర్ల జాబితాలో పేరు రాని వారితోపాటు మార్పులు, చేర్పులకు సెప్టెంబర్ 17 వరకు అవకాశం ఉందన్నారు. పట్టణంలోని పలు వార్డుసభల్లో పాల్గొని మాట్లాడారు. పేరు లేనివారు కొత్తగా నమోదు కోసం ఫారం–6, సవరణల కోసం ఫారం–8, అనర్హుల పేర్ల తొలగింపునకు ఫారం–7 నింపి బీఎల్‌వోలకు అందజేయాలని తెలిపారు. వార్డుల్లోకి వచ్చే బీఎల్వోలకు సహకరించి రీ–వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.


