● జిల్లా విద్యాధికారి మొండయ్య
సిరిసిల్ల అర్బన్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని డీఈవో మొండయ్య కోరారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా శనివారం సిరిసిల్ల మినీస్టేడియంలో వాలీబాల్, కబడ్డీ, ఆర్చరీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు, జాతీయస్థాయిలో వివిధ క్రీడాపోటీల్లో పాల్గొ ని గెలుపొందిన 20 మంది విజేతలకు మెడల్స్ అందించారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, నెహ్రూ యువకేంద్రం కోఆర్డినేటర్ కిరణ్‌కుమార్, జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి రాందాస్, నో డల్ ఆఫీసర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లెల్లలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని బీజేఆర్ వ్యవసాయ కళాశాలలో ఈనెల 31న పుట్టగొడుగుల సాగుపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ శనివారం తెలిపారు. పుట్టగొడుగుల రకాలు, పెంపకం విధానాలు, స్పాన్(విత్తన) తయారీ, వాతావరణ సంరక్షణ, మార్కెటింగ్ ద్వారా ఆదాయం పొందే మార్గాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారు. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ అందజేస్తామని తెలిపారు. ఆసక్తి గల వారు 8309832025, 9182511749లలో సంప్రదించాలని కోరారు.


