సిరిసిల్లటౌన్: పెండింగ్‌లో ఉన్న నిరుపేద విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. రూ.15వేల కోట్ల ఫీజు బకాయిలను చెల్లించకుండా 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను రేవంత్ సర్కారు ప్రశ్నార్థకం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో బీజేవైఎం ఆధ్వర్యంలో ‘ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ జిల్లా ఇన్‌చార్జి గంగాడి మోహన్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, నాయకులు ఎర్ర మహేశ్, లింగంపల్లి శంకర్, కుమ్మరి శంకర్, శీలం రాజు తదితరులు పాల్గొన్నారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): విద్యార్థుల యూనిఫాం తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని డీఆర్డీవో లక్ష్మీనారాయణ సూచించా రు. మండలంలోని జిల్లెల్ల గ్రామంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూల్ యూనిఫామ్స్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. అంతకుముందు బద్దెనపల్లిలో నిర్మించిన బోరుబావి రీచార్జ్ పిట్ పనులను తనిఖీ చేశారు. ఎంపీడీవో డి.రమేశ్, ఎంపీవో మీర్జా అఫ్జల్ అహ్మద్‌బే గ్, ఏపీవో రాజనర్సయ్య, బద్దెనపల్లి గురుకులం ప్రిన్సిపాల్ పద్మ దర్శనాల పాల్గొన్నారు.
క్రీడా భవనానికి డోర్
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని క్రీడా భవనానికి డోర్ బిగించారు. క్రీడాభవనం పశువులకు నిలయంగా మారిందంటూ ‘సాక్షి’లో ఈనెల 24న ప్రచురితమైన ‘క్రీడా భవనం.. పశువులకు నిలయం’ కథనానికి అధికారులు స్పందించారు. క్రీడా భవనంలోకి పశువులు వెళ్లకుండా.. కట్టడి చేసేందుకు డోర్‌ను బిగించారు. సిరిసిల్ల మున్సిపల్ అధికారులు కళాశాల మైదానంలో పెండింగ్ పనులు చేయాల్సి ఉంది. మూత్రశాలల నిర్మాణం, నీటి వసతి కల్పించడం వంటి పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
సిరిసిల్లటౌన్: ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో సిబ్బంది ఆగడాలు పెరిగిపోతున్నాయని సీపీఎం సిరిసిల్ల కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ ఆరోపించారు. ఆస్పత్రికి వచ్చే పేషంట్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ శనివారం ఆస్పత్రి ఎదుట బాధితులతో కలిసి నిరసన తెలిపి మాట్లాడారు. గాయాలతో ప్రభుత్వ హాస్పిటల్‌కు సిరిసిల్ల వాసి చంద్రకాంత్ వెళ్తే.. డ్రెస్సింగ్ చేసే టైము కాలేదని విధుల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా చికిత్స చేయకుండా మూడు గంటలు నిలబెట్టుకున్నారని ఆరోపించారు. కలెక్టర్ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సూరం పద్మ, సిరిమల్లె సత్యం, బెజగం సురేష్, దాసరి రూప, గుంటుక శివ, శ్రీరాముల రమేశ్‌చంద్ర, ఆంబోతు లక్ష్మి, భాగ్యమ్మ, ఉమా తదితరులు పాల్గొన్నారు.


