సిరిసిల్ల/వేములవాడఅర్బన్: గర్భస్థ లింగనిర్ధారణ తీవ్ర నేరమని, చట్టాలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ హెచ్చరించారు. తన కార్యాలయంలో గురువారం పీసీపీఎన్‌డీటీ జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో మాట్లాడారు. స్కానింగ్ సెంటర్లపై నిఘా ఉంచామన్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా అబార్షన్ మాత్రలు విక్రయాలపై సమీక్షించారు. వేములవాడ మండలం చీర్లవంచలో పీజీడీహెచ్‌పీఈ శిక్షణార్థి సరోజన ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తపోటుపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగేందర్‌బాబు, గైనకాలజీ విభాగాధిపతి సుగుణ, పీడియాట్రీషియన్ పరమేశ్, డీపీఆర్వో పి.బి.శ్రీనివాసాచారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజనీకాంత్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భాస్కర్, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, అరవింద్, ప్రోగ్రాం అధికారి రామకృష్ణ, సర్పంచ్ కిరణ్మయి, పీహెచ్‌సీ వైద్యాధికారి శరణ్య, ప్రసాద్ పాల్గొన్నారు.


