జాతీయ జెండా ఆవిష్కరించనున్న విప్
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో శనివారం జరిగే 80వ స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొననున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేస్తారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించి ప్రసంగిస్తారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనను తిలకిస్తారు. ఉత్తమ సేవలు అందించిన అధి కారులకు ప్రశంసాపత్రాలు అందిస్తారు. స్వాతంత్య్ర దినో త్సవ ఏర్పాట్లపై కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.


