సిరిసిల్లటౌన్: శ్రావణమాసంలో భక్తులకు రాజన్న దర్శనం కల్పించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. ఈమేరకు కలెక్టర్ గరీమా అగ్రవాల్‌కు గురువారం వినతిపత్రం అందించి, మాట్లాడారు. వేములవాడ రాజన్న ఆలయంలో అభివృద్ధి పనుల పేరుతో గత 9 నెలలుగా భక్తులకు స్వామివారి దర్శనం నిలిపి వేశారన్నారు. శ్రావణమాసంలో రాజన్నను దర్శించుకునే అవకాశం కల్పించాలని కోరారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
12వ ప్యాకేజీ పనులు పూర్తి చేయాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన మల్లన్నసాగర్ పన్నెండో ప్యాకేజీ పనులు త్వరగా పూర్తి చేసి రెండు మండలాల రైతులకు సాగునీటిని అందించాలని ప్రభుత్వానికి సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి గుంటి వేణు డిమాండ్ చేశారు. చిప్పలపల్లి, చీకోడు గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న 12వ ప్యాకేజీ పనులను రైతులతో కలిసి గురువారం పరిశీలించారు. వేణు మాట్లాడుతూ కెనాల్ పనులు పూర్తి చేస్తే ముస్తాబాద్ మండలంలోని మద్దికుంట, మోహినికుంట, మొర్రాయిపల్లె, చిప్పలపల్లి, గూడూరు, నామాపూర్, చీకోడు, బందనకల్, ముస్తాబాద్ గ్రామాల్లో 12వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. అలాగే 18 చెరువులు నింపవచ్చని పేర్కొన్నారు. గంభీరావుపేట మండలంలో 10వేల ఎకరాలకు, 12 చెరువులకు నీరు అందించవచ్చన్నారు. సుద్దాల రాజయ్య, జంగటి రామచంద్రం, బాలరాజు, నరేందర్ ఉన్నారు.
‘బీజేపీది ప్రజావ్యతిరేక పాలన’
ఇల్లంతకుంట(మానకొండూర్): కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ విమర్శించారు. మండలంలోని పొ త్తూరులో గురువారం సీపీఐ ప్రజాచైతన్య ప్ర చార పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. ఆగస్టు 6 నుంచి దేశవ్యాప్త రాజకీయ ప్రచార పాదయాత్రలకు పిలుపునిచ్చిందన్నారు. సె ప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే ర్యాలీతో ముగుస్తుందని పేర్కొన్నారు. భూంపల్లి భూమిరెడ్డి, మంద అనిల్‌కుమార్, సావనపెల్లి మల్లేశం, మొండయ్య, ఆదిత్య, బక్కయ్య, తిరుపతి, రాజయ్య, కనకయ్య, వెంకటయ్య, రాజు, అశోక్, అనిల్ పాల్గొన్నారు.
చిరుజల్లులు
సిరిసిల్ల: జిల్లాలోని 11 మండలాల్లో గురువారం చిరుజల్లులు కురిశాయి. వీర్నపల్లిలో అత్యధికంగా 4.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. రుద్రంగిలో 0.4, చందుర్తిలో 0.9, వేములవాడ రూరల్‌లో 2.3, బోయినపల్లిలో 0.3, వేములవాడలో 2.7, కోనరావుపేటలో 2.5, ఎల్లారెడ్డిపేటలో 0.3, గంభీరావుపేటలో 0.8, ముస్తాబాద్‌లో 1.8, ఇల్లంతకుంటలో 2.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాల్లో వర్షం పడలేదు. జిల్లా వ్యాప్తంగా సగటు వర్షపాతం 1.4 మిల్లీమీటర్లుగా నమోదైంది.
ఎంపీడీవోలకు శిక్షణ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల స్థాయి ప్రజావాణి, జలసిరి, జీపీఎస్‌ఏఏపీ, పంచాయతీరాజ్ అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీడీవోలకు హైదరాబాద్‌లో గురువారం శిక్షణ నిర్వహించారు. రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్‌చైర్మన్ జి.చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ఎంపీడీవోలు జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూ చించారు. జిల్లాకు చెందిన అధికారులు భీమ జయశీల, రాధ, శశికళ, రాజేందర్, స్నిగ్ధ, ల చ్చాలు, నటరాజ్, రమేశ్, శ్రీలేఖ, బింగి కీర్తన, శ్రీనివాస్, సత్తయ్య, ఖదీర్‌పాషా ఉన్నారు.


