ఫీజు బకాయిలపై పోరుబాట
సిరిసిల్ల అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడుతోందని, పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదుల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మాల్లరపు ప్రశాంత్ కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ర్యాలీగా కలెక్టరేట్ వరకు వెళ్లి ధర్నా చేపట్టారు. సాయిరాం, రషీద్, విజయ్, బాలాజీ, ఆదిత్య, రెహాన్, మానస, అఖిల, ప్రియాంక, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.
కోనరావుపేట/ఎల్లారెడ్డిపేట: గిరిజన యువతులు గురువారం తీజ్ పండుగను సంబురంగా నిర్వహించుకున్నారు. కోనరావుపేట మండలం జైసేవాలాల్ భూక్యారెడ్డితండాలో జరిగిన వేడుకలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగుండారంలో జరిగిన వేడుకల్లో గిరిజన యువతులు చేసిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. సర్పంచ్ బానోత్ నరేశ్‌నాయక్, సింగిల్‌విండో చైర్మన్ బండ నర్సయ్య, ఏఎంసీ వైస్‌చైర్మన్ తాళ్లపెల్లి ప్రభాకర్, ఆలయ చైర్మన్ రాజునాయక్, డీసీసీ కార్యదర్శి ఫిరోజ్‌పాషా పాల్గొన్నారు.


