ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు కుక్క, కోతి, ఎలుక, పిల్లి కాటుకు గురైన వారు..
నెల కుక్క కోతి పిల్లి ఎలుక
జనవరి 87 14 02 04
ఫిబ్రవరి 58 20 04 12
మార్చి 53 28 15 18
ఏప్రిల్ 41 12 03 04
మే 93 13 08 03
జూన్ 59 20 07 07
మొత్తం 391 107 39 48
ఇళ్లపై, పండ్ల చెట్ల మీద కోతులు గుంపుగా ఉంటున్నాయి. ఇంటి ముందుకు వస్తే చాలు మీద దూకుతున్నాయి. కోతులతో ఇబ్బందిగా మారింది. వాటి బెడద తప్పించాలి.
– లచ్చయ్య, గొల్లపల్లె
తెల్లారగానే కోతులు ఎక్కడ మీద దూకుతాయో అని భయంతో చేతిలో కట్టె పట్టుకుని వెళ్తున్నం. పిల్లలు ఇంటి బయటకు వస్తే చాలు మీద దూకుతున్నాయి. కోతులతో భయంగా ఉంది.
– కనుకయ్య, నాంపల్లి
కుక్క, కోతి, పిల్లి, ఎలుక కాటుకు గురైనవారు నిర్లక్ష్యం చేయొద్దు. వేములవాడ ఏరియా ఆస్పత్రిలో మందులు అందుబాటులో ఉన్నా యి. ఆస్పత్రిలో సంప్రదించి వైద్యుల సూచనల ప్రకారం డోస్‌లు వాడాలి.
– రవీందర్, సూపరింటెండెంట్, వేములవాడ ఏరియా ఆస్పత్రి
వేములవాడఅర్బన్: గతంలో అడవిలో కోతులకు పండ్లు ఫలాలు దొరికితే తిని అక్కడే ఉండేవి. ప్రస్తుతం అడవుల్లో పండ్ల చెట్లు తగ్గి ఆహారం దొరక్కపోవడంతో పల్లెలు, పట్టణాల బాట పట్టాయి. ఉదయం లేస్తే చాలు ఇంటి ముందు కోతుల మందలు ఉంటున్నాయని జనం ఆవేదన చెందుతున్నారు. ఇళ్లలో పండ్ల చెట్లపై ఉంటూ దాడులకు పాల్పడుతున్నాయని వాపోతున్నారు. అవి మందగా కనిపిస్తే చాలూ జనం పరుగులు పెడుతున్నారు. అలాగే పట్టణాలు, పల్లెల్లో జనాలను కుక్కలు హడలెత్తిస్తున్నాయి. రోజుకు కనీసం ఇద్దరు ముగ్గురినైనా కరుస్తున్నాయి. అధికారులకు విన్నవించినా పట్టించుకునే వారు కరువయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు.


