● ఎస్పీ మహేశ్ బీ గీతే ● గ్రీవెన్స్ డేకు 36 ఫిర్యాదులు
సిరిసిల్ల: జిల్లాలో బాధితులకు చట్టపరిధిలో సత్వర న్యాయం అందించేందుకు పోలీస్‌శాఖ కృషి చేస్తోందని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించగా 36 మంది వారి సమస్యలపై ఫిర్యాదులు అందించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలుబెట్టుకుంటూ సత్వరం పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యలను పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులపై ఎస్‌హెచ్‌వోలకు ఫోన్‌చేసి సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు.
61 మంది బాలకార్మికులకు విముక్తి
సిరిసిల్ల: జిల్లాలో 20 రోజుల్లో 61 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించామని, పిల్లలతో పని చేయిస్తున్న 17 మందిపై కేసులు నమోదు చేశామని అదనపు ఎస్పీ చంద్రయ్య తెలిపారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో సోమవారం ‘ఆపరేషన్ ముస్కాన్’పై సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా జిల్లాలోని పరిశ్రమలు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు, గోదాములు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీల ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. జూలై 1 నుంచి 31 వరకు పోలీస్, చైల్డ్ వెల్ఫేర్, కార్మిక, విద్య, బాలల రక్షణ శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 20 రోజులలో 61 మంది పిల్లలు పనిలో ఉన్నట్లు గుర్తించామని ఏఎస్పీ తెలిపారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పనిచేయిస్తున్న 17 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. డీసీఆర్బీ డీఎస్పీ భాస్కర్, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, ఎస్సైలు ప్రేమానందం, లక్పతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జి డీపీఆర్వోగా శ్రీనివాసాచారి
సిరిసిల్ల అర్బన్: ఇన్‌చార్జి డీపీఆర్వోగా శ్రీనివాసాచారి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనారోగ్య కారణాలతో ఇక్కడ పనిచేస్తున్న డీపీఆర్‌వో ఏడుకొండలు సెలవులో వెళ్లగా ఆయన స్థానంలో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారిగా వ్యవహరిస్తున్న శ్రీనివాసాచారి కలెక్టర్ ఆదేశాలతో బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీకి అన్ని చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.


