సమగ్ర అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సమగ్ర అభివృద్ధే లక్ష్యం

Jul 21 2026 12:05 AM | Updated on Jul 21 2026 12:05 AM

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

చందుర్తి(వేములవాడ): అన్ని వర్గాల అభ్యున్నతి, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమ పథఽకాలు అమలు చేస్తోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. చందుర్తి రైతువేదిక మండలంలోని 45 మంది లబ్ధిదారులకు రూ.12.59లక్షల చెక్కులను అందజేశారు. విప్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని దేవుని, జలపతి తండాల్లోని బీఆర్‌ఎస్‌, బీజేపీలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు గొట్టే ప్రభాకర్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ ముష్కు ముకుందరెడ్డి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్‌, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపంటి రామస్వామి, బానాల రవీందర్‌రెడ్డి, సంతుపూరి బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement