రెండేళ్లలో లారీలపై విధించిన లెవీ
రెండేళ్లలో రూ.6.30 కోట్ల లెవీ వసూలు!
రోజుకు వందలాది లారీలు..
వాహనానికి రూ.500 చొప్పున 1.24 లక్షల లారీలపై ట్యాక్స్
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●:
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం మరోసారి వార్తల్లోకెక్కింది. ఆ మధ్య జిల్లాలో గాడితప్పుతున్న పోలీసులకు క్లాస్ తీసుకున్న కలెక్టర్ కార్యాలయం ఇటీవల ఇతర జిల్లాల నుంచి వస్తున్న లారీలకు భారీ జరిమానాలు విధిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా కలెక్టర్ కార్యాలయం తీసుకున్న మరో నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. రామగుండంలోని కుందనపల్లి బూడిద లారీల నుంచి వసూలు చేస్తున్న ప్రత్యేక లెవీ చార్జీలు జిల్లాలో చర్చానీయాంశంగా మారాయి. నిత్యం కుందనపల్లి యాష్‌పాండ్ నుంచి వందలాది లారీలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ గమ్యస్థానాలకు బయల్దేరుతుంటాయి. అలా బయల్దేరాలంటే ముందు ప్రతీ లారీ రూ.500 లెవీ చార్జీలు చెల్లించాలి. ఈ లెవీ చార్జీలు చెల్లిస్తేనే లారీలు కదులుతాయి.
ఎందుకు చేస్తున్నారు?
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తికి నిత్యం వందల టన్నుల బొగ్గు మండించాల్సి వస్తుంది. ఫలితంగా ఉత్పత్తి అయిన బూడిదను కుందనపల్లి చెరువులో కలుపుతారు. ఈ బూడిద గాలిలో కలిసి పరిసరాలను కాలుష్యభరితం చేస్తుంది. బూడిద గాలిలోకి లేవడం వల్ల ఉత్తరాదికి వెళ్లే రైళ్లకు అంతరాయం కలిగింది. దీంతో పర్యావరణ హితం కోసం ఈ బూడిదను ఇటుకబట్టీలు, రోడ్ల నిర్మాణాల్లో వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం అనివార్యం చేసింది. ఈ నేపథ్యంలో కుందనపల్లి యాష్‌పాండ్‌లోని బూడిదకు ఎన్టీపీసీ టెండర్లు పిలిచి, ఇటుకబట్టీ వ్యాపారులకు విక్రయిస్తుంది. కరోనా తరువాత ఈ బూడిదకు డిమాండ్ పెరగడంతో గతంలో పలువురు రాజకీయ నాయకుల జోక్యం చేసుకోవడంతో బూడిద రేట్లు పెరగడం, పరోక్షంగా ఇటుకల ధర కూడా పెరిగింది. కానీ, ప్రస్తుత జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రతీ లారీకి లెవీ చార్జీలు వసూలు చేస్తూ దాన్ని జిల్లా మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తున్నారని చెప్పడం గమనార్హం.
అంతర్గాం తహసీల్దార్ పేరిట..
జనవరి 2024 నుంచి బూడిద లారీలపై లెవీ పేరిట చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రతీ లారీకి రూ.500 చొప్పున లెవీ చార్జీలను కలెక్టర్ కార్యాలయం ఆదేశాల మేరకు అంతర్గాం తహసీల్దార్ వసూలు చేస్తున్నారు. రెండేళ్ల కాలంలో దాదాపు 1.24 లక్షల లారీలపై దాదాపు రూ.6.30 కోట్ల వరకు లెవీ చార్జీలు వసూలు చేశారు. వీటిని జిల్లాలోని ఆసుపత్రి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తున్నారని కలెక్టర్ కార్యాలయం పలుమార్లు తెలిపింది. ఇదే విషయమై కలెక్టర్ శ్రీహర్షను వివరణ కోరేందుకు సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
1,24,220
ఫిబ్రవరి 24–
అక్టోబర్
25 వరకు
అక్టోబరు 25– మార్చి 26 వరకు
జనవరి 24– మార్చి 26 వరకు
జూలై 24– ఏప్రిల్ 25 వరకు
ఫిబ్రవరి 25– మార్చి 26 వరకు
మొత్తం
ఇటుక బట్టీలకు
ఖమ్మం దేవరపల్లి హైవేకు
గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం
ఇటుకబట్టీలకు
ఇటుక బట్టీలకు
(వివరాలు 2026 మార్చి 31 వరకు)
అంతర్గాం తహసీల్దార్ పేరిట చెల్లించిన లెవీ చార్జీలు
65,727
25,814
21,217
8,054
3,408


