న్యూస్‌రీల్
అపజయం వెనుకే జయం
ఫలితాలు జీవితానికి ముగింపు కాదు
మనోధైర్యంగా ఉండాలంటున్న నిపుణులు
నేడు ఇంటర్ ఫలితాలు
వచ్చే నెలలో పదోతరగతి రిజల్ట్స్
ఇంటర్ విద్యార్థులు 68,709..
‘పది’ విద్యార్థులు 40,099 మంది
ఆదివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
శంకరపట్నం: సక్సెస్‌కు మార్కులే కొలమానం కాదని నిరూపించారు ప్రస్తుత హైదరాబాద్ మెట్రోవాటర్‌బోర్డు ఎండీ కోరెం అశోక్‌రెడ్డి. ఇంటర్ ఫెయిలైన అశోక్‌రెడ్డి.. తర్వాత పట్టవదలని విక్రమార్కుడిలా పుస్తకాలతో కుస్తీ పట్టి గ్రూప్–1 సాధించారు. ప్రస్తుత కన్‌ఫార్మ్‌డ్ ఐఏఎస్ అధికారి హోదాలో సేవలందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన కోరెం అశోక్‌రెడ్డి మొలంగూర్ జెడ్పీ హైస్కూల్‌లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. హుజూరాబాద్ జూనియర్ కాలేజీ ఇంటర్ చదివారు. సెకండియర్‌లో ఫెయిల్ అయినా సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయ్యారు. జమ్మికుంటలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసి గ్రూప్–1 ఉద్యోగానికి ఎంపికయ్యారు. సీ్త్రశిశుసంక్షేమశాఖ పీడీగా ఉద్యోగంలో చేరి, కన్‌ఫార్మ్‌డ్ ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డు ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మార్కులు, ర్యాంకులు కొలమానం కాదని పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని అశోక్‌రెడ్డి అంటున్నారు.
మార్కులు..ర్యాంకులే చదువుకు కొలమానం అనుకుంటున్న
నేటితరం విద్యార్థులు ఒక్కక్షణం ఆగండి.. వీరి విజయగాథలు చదవండి. పదో తరగతిలో ఫెయిలైన వారు.. ఇంటర్‌లో అత్తెసరు మార్కులతో పాసైన వారు.. డిగ్రీ కూడా చదవని వారు.. అద్భుతాలు సృష్టించారు. వారు వేసిన మార్గంలోనే నేడు డిగ్రీ.. బీటెక్.. ఎంటెక్ విద్యార్థులు ముందుకెళ్తున్నారు. డిగ్రీ పూర్తి చేయని బిల్‌గేట్స్.. బోర్డు ఎగ్జామ్ రాయని సచిన్ టెండూల్కర్.. ఆటోడ్రైవర్‌గా జీవితాన్ని ఆరంభించిన సత్యశంకర్ విజయాలే మనకు మార్గంకావాలి. అంతెందుకు మన జిల్లా వాసి.. కొత్తగట్టుకు చెందిన కోరెం అశోక్‌రెడ్డి ఇంటర్ ఫెయిలయ్యానని కుంగిపోయి ఉంటే ఈరోజు ఐఏఎస్ అయ్యేవారే కాదు.. అందుకే ఒక్క క్షణం ఆలోచించండి.. పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయని.. ఇంటర్ ఫెయిల్ అయ్యామని కుంగిపోకండి. దీని తర్వాత జీవితం చాలా ఉంది. ధైర్యంతో ముందుకెళ్తే మీలో నుంచే ఓ బిల్‌గేట్స్.. సత్యశంకర్.. మనోజ్‌కుమార్‌శర్మ.. కోరెం అశోక్‌రెడ్డి వారసులు రావచ్చు. ఇంటర్ ఫలితాలు ఎలా ఉన్నా.. ధైర్యంగా ముందుకెళ్దాం.. – సప్తగిరికాలనీ(కరీంనగర్)
– వివరాలు 8లో...
36,426
9,054
7,424
8,106
7,699
18,251
4,748
4,306
4,060
4,046
18,175
15,123
జగిత్యాల
రాజన్నసిరిసిల్ల
పెద్దపల్లి
కరీంనగర్
‘సత్యశంకర్.. ఓ పానీయం ఉత్పత్తి చేసే బిందు కంపెనీ యజమాని. ఆయన ఇంటర్ వరకు చదువుకుని ఆటో డ్రైవర్‌గా తన ప్రస్థానం మొదలుపెట్టారు. అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఇప్పుడు రూ.800 కోట్ల వ్యాపారానికి యజమాని అయ్యారు. ఆయనే వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు.’
‘మనోజ్‌కుమార్‌శర్మ.. మధ్యప్రదేశ్‌లోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు. 12వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. కానీ నిరాశ చెందలేదు. ఐపీఎస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర పోలీస్‌లో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో పనిచేస్తున్నారు.’
‘మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. తొలుత ఓ కంపెనీని స్థాపించి తీవ్రంగా నష్టపోయారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్‌పై తనకున్న కోరిక, విషయ పరిజ్ఞానం మైక్రోసాఫ్ట్ పేరిట సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించేలా చేసింది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే.’
‘సచిన్ టెండూల్కర్ పదిలో ఉత్తీర్ణత సాధించలేకపోయినా తనకు ఇష్టమైన క్రికెట్ ఆటలో చరిత్ర సృష్టించారు. పదహారేళ్ల ప్రాయంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి క్రికెట్ ప్రపంచానికి దేవుడయ్యారు’
‘విజయ్ వర్షన్..తుషార్ సుమెరా.. హరియాణాకు చెందిన ఐఏఎస్ అధికారి ఏకంగా 35సార్లు పరీక్షలు రాసి విఫలమైనా చివరికి 2021లో సివిల్స్ 70వ ర్యాంకుతో ఐఏఎస్ సాధించారు. గుజరాత్‌లోని ఐఏఎస్ అధికారి పదోతరగతి ఆంగ్లంలో 35, గణితంలో 36, సైన్సులో 38 మార్కులే సాధించారు. తర్వాత తన లక్ష్యం సివిల్స్‌పై పెట్టి అనుకున్నది సాధించారు.’


