● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● డీ అడిక్షన్ సెంటర్ ప్రారంభం
సిరిసిల్ల: డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై యువతకు వైద్యులు, వైద్య విద్యార్థులు అవగాహన కల్పించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. ఆరోగ్య వారోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం సిరిసిల్ల శివారులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై వైద్య విద్యార్థులు ఫ్లాష్‌మాబ్ షో ద్వారా వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో వైద్యులకు ఎంతో గౌరవం ఉంటుందన్నారు. డ్రగ్స్‌తో కలిగే నష్టాలు, భవిష్యత్‌లో వచ్చే ఇబ్బందులపై వైద్యవిద్యార్థులు అవగాహన కల్పించాలని సూచించారు.
పనులు గడువులోగా పూర్తి చేయాలి
మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వైద్యకళాశాల భవనం, బాలుర, బాలిక హాస్టళ్లు, మెస్ ఇతర పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ సీఈ రాజేశ్వరరెడ్డి, ఈఈ నరసింహాచారి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరీ, వైస్‌ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జున చక్రవర్తి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్, ఆర్‌ఎంవో సంతోష్‌కుమార్, సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్‌కుమార్ ఉన్నారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రం ప్రారంభం
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం డీ–అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి ప్రారంభించారు. అనంతరం నూతన కోర్టు భవన పనులను పరిశీలించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్, జిల్లా వైద్యాధికారి రజిత, ఆర్‌ఎంవో సంతోష్‌కుమార్, తహసీల్దార్ మహేశ్‌కుమార్ పాల్గొన్నారు.
అన్నదానసత్రం పనుల్లో వేగం పెంచాలి
వేములవాడఅర్బన్: వేములవాడ రాజన్న ఆలయ అన్నదానసత్రం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆర్‌అండ్‌బీ అధికారులను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. నూతన అన్నదానసత్రం పనులను ఆర్‌అండ్‌బీ సీఈ రాజేశ్వరరెడ్డితో కలిసి పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహాచారి, డీఈ శాంతయ్య, ఆలయ ఇన్‌చార్జి ఈవో అంజనారెడ్డి, డీఈ రఘునందన్, తహసీల్దార్ జయంత్‌కుమార్ ఉన్నారు.


