ఔషధ నియంత్రణశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జూకంటి రాజు
ఫార్మసిస్టులతో ప్రతిజ్ఞ.. పోస్టర్ల ఆవిష్కరణ
సిరిసిల్ల: ప్రజారోగ్య పరిరక్షణలో మెడికల్(కెమిస్ట్) దుకాణదారుల బాధ్యత గొప్పదని ఔషధ నియంత్రణశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జూకంటి రాజు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్, కార్యక్ర మ నోడల్ అధికారి రాజు మాట్లాడుతూ మందుల దుర్వినియోగం చేయొద్దని, ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు. యాంటీబయోటిక్స్ మందుల వాడకంపై అవగాహన కల్పించారు. జిల్లా వైద్యాధికారి రజిత మాట్లాడుతూ జిల్లాలో బాల, బాలికల నిష్పత్తిలో తేడా ఉందని, అబార్షన్‌కు సంబంధించిన మందుల విక్రయాలపై నిఘా ఉంచా మన్నారు. ఎవరూ తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా ఆరోగ్య రక్షణకు ప్రతి ఒక్క రూ బాధ్యతగా వ్యవహరించాలని కెమిస్ట్‌లతో ప్రతిజ్ఞ చేయించారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ప్రో గ్రాం ఆఫీసర్ సంపత్‌కుమార్, ఈగల్ ఫోర్స్ టీం రా జమౌళి, నవీన్, మెడికల్ అసోసియేషన్ జిల్లా ప్రధా న కార్యదర్శి బోడ రవీందర్, గౌరవ అధ్యక్షుడు చేపూరి జనార్దన్, చేపూరి బుచ్చయ్య పాల్గొన్నారు.


