ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లబొప్పాపూర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవానికి హాజరుకావాలని కోరుతూ గ్రామస్తులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌కు శనివారం ఆహ్వానపత్రిక అందజేశారు. హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసంలో కలిసి ఈనెల 18, 19, 20 తేదీలలో జరిగే విగ్రహ ప్రతిష్ట, కల్యాణ వేడుకలకు రావాలని కోరారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, నాయకులు ఇల్లందుల శ్రీనివాసరెడ్డి, దేవిరెడ్డి, కృష్ణ, శివ, సతీశ్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
డ్రైవింగ్‌లో సర్టిఫైడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న వెయ్యి డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం ఈనెల 23న నిర్వహించే పరీక్షలకు అభ్యర్థులను సిద్ధం చేసేందుకు డ్రైవింగ్ శిక్షణ సంస్థ ఐటీడీఆర్, టైడ్స్ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ దురై మురగన్ తెలిపారు. ఈమేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. పది రోజుల సర్టిఫైడ్ రిఫ్రెషర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు సమాచారం కోసం 89854 31720లో,
http://www.tidessircilla.com వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ ఎస్‌ఈఈ భిక్షపతి, డీఈఈ అంజయ్య పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ప్రజాబాటను శనివారం నిర్వహించారు. ఏడీఈ శ్రీనివాస్, ఏఈఈ పృథ్వీధర్‌గౌడ్, సర్పంచ్ సోమారపు శరవిందు పాల్గొన్నారు.
సొంతింటి కలను నెరవేర్చుతున్నాం
ఎల్లారెడ్డిపేట/తంగళ్లపల్లి(సిరిసిల్ల): నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సాబేరబేగం, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండలాల అధ్యక్షులు సద్దిలక్ష్మారెడ్డి, ప్రవీణ్ టోనీ తదితరులు పాల్గొన్నారు.
సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి
వేములవాడరూరల్: హిందువులు ఏకమై సనాతన ధర్మాన్ని రక్షించుకుందామని బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు పరమేశ్ అన్నా రు. మండలంలోని లింగంపల్లిలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాలు హిందూ ధర్మం వైపు చూస్తున్నాయన్నారు. సమావేశాన్ని బొల్లారం, హన్మాజిపేట, మల్లారం, జయవరం, లింగంపల్లి గ్రామస్తులు విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మధు, మల్లిఖార్జున్, మల్లయ్య పాల్గొన్నారు.


