హ్యాపీ న్యూ ఇయర్
సిరిసిల్లటౌన్: పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ
కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణలోని బేకరీలు, మిఠాయి దుకాణాల్లో విక్రయాలు జోరందుకున్నాయి. మహిళలు రంగులు కొనడానికి ఉత్సాహం చూపారు. గ్రీటింగ్‌కార్డులు, కేకుల విక్రయాలతో మార్కెట్‌లో పండుగ వాతావరణం సంతరించుకుంది. ఆసిఫ్‌పురకాలనీలో చిన్నారులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. విద్యానగర్ శ్రీఅభయాంజనేయ వెల్పేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సంగీతం, నృత్యాలతో హోరెత్తించారు.


