విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ
వేములవాడ ఆలయ అభివృద్ధి, రోడ్ల విస్తరణ పనులు వేగంగా చేయిస్తాం. మహాశివరాత్రి నాటికి పనులు ఓ రూపానికి వచ్చేలా చేస్తాం. సంక్షేమ పథకాలను సమర్థంగా, పారదర్శకంగా అమలు చేస్తాం. పాలనలో తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. విద్య, వైద్యానికి తొలి ప్రాధాన్యతనిస్తాం. స్కూళ్లను జిల్లా స్థాయి అధికారులకు దత్తత ఇచ్చి.. అభివృద్ధికి బాట లు వేస్తాం. టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి విద్యారంగాన్ని బాగుచేస్తాం. పేదలకు సర్కారు వైద్యం మెరుగ్గా అందేలా చర్యలు తీసుకుంటాం. జిల్లాలో పర్యాటక రంగాన్ని గుర్తించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. అపెరల్ పార్క్, టెక్స్‌టైల్‌పార్క్‌లతో పాటు కొత్త ఉపాధికి, ఉద్యోగాల కల్ప నకు ప్రణా ళికాబద్ధంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది.
– గరీమా అగ్రవాల్, కలెక్టర్


