ఏడాదిగా సిద్దిపేటకు వెళ్తున్నాం
కరీంనగర్ ఆస్పత్రికి డయాలసిస్‌కు వెళ్లాం. కొద్ది రోజులు సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ పేషంట్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి నన్ను తీసుకెళ్తున్నారు. పోతుగల్ పీహెచ్‌సీలో డయాలసిస్ ఏర్పాటు చేస్తే ముస్తాబాద్ మండలంలోని కిడ్నీ పేషంట్లను ఆదుకున్నావారవుతారు.
– గూడెపు మణెమ్మ, ముస్తాబాద్
కరీంనగర్ వెళ్లడం ఇబ్బందిగా ఉంది
నెల రోజుల క్రితం కిడ్నీ వ్యాధికి గురయ్యాను. డయాలసిస్ చేయాలన్నారు. నా కొడుకు ప్రభుత్వ ఉద్యోగి. సిరిసిల్ల గవర్నమెంట్ దవాఖానలో నాకు డయాలసిస్ చేయరాదన్నారు. వారం రోజులకోసారి కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లడం చాలా బాధ కలుగుతుంది. మాకు ఇక్కడే డయాలసిస్ చేస్తే బాగుండేది.
– తడుకల దేవయ్య, బండలింగంపల్లి
కిడ్నీ పేషంట్లు పెరుగుతున్నారు
వేములవాడ ఏరియా ఆస్పత్రికి కిడ్నీ పేషంట్లు భారీగా వస్తున్నారు. ఇక్కడ ఐదు బెడ్లు మాత్రమే ఉన్నాయి. నెలలో 450 మందికి ఇక్క డ డయాలసిస్ చేస్తున్నాం. మరో ఇరవై బెడ్లు ఏర్పాటు చేస్తే కిడ్నీ రోగులందరికీ డయాలసిస్ చేయడం సులభమవుతుంది. ఈమేరకు అధికారులకు నివేదిక పంపాం.
– డాక్టర్ నాగరాజు,
వేములవాడ, ప్రాంతీయ ఆస్పత్రి
ఏడాదిగా సిద్దిపేటకు వెళ్తున్నాం


