
అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు
సిరిసిల్లటౌన్: అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఎంపిక పోటీలను బతుకమ్మ ఘాట్‌లో నిర్వహించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ పోటీలను ప్రారంభించారు. అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో క్రీడాకారులు పోటీపడ్డారు. విజేతలకు మెడల్స్‌ను డాక్టర్ కోడూరు రవీందర్‌శాసీ్త్ర చేతులమీదుగా అందజేశారు. ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెల 30, 31 తేదీల్లో మహబూబ్‌నగర్‌లో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. జిల్లా అథ్లెటిక్స్ ఉపాధ్యక్షుడు రామచంద్రన్, గొట్టె రామచంద్రం, కనకం శ్రీనివాస్, పీఈటీలు రాజు, సాయికృష్ణ, శైలజ, సంధ్య పాల్గొన్నారు.