
అభివృద్ధే ధ్యేయం
● ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి(చొప్పదండి): నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. పనుల జాతరలో భాగంగా రూ.25లక్షలతో చేపట్టిన బోయినపల్లి మోడల్‌స్కూల్ సీసీ రోడ్డు పనులను శుక్రవారం ప్రారంభించారు. రూ.15లక్షలతో నిర్మించే స్తంభంపల్లి అంగన్‌వాడీ భవనానికి భూమి పూజ చేశారు. రెండు గ్రామాల గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లను సత్కరించారు. డీఆర్డీవో శేషాద్రి, పీఆర్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీవో జయశీల, ఏపీవో సబిత, ఇన్‌చార్జి తహసీల్దార్ భూపేశ్, పీఆర్ డీఈ విష్ణువర్ధన్, ఏఈ సాయితేజ, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్‌యాదవ్, ప్యాక్స్ చైర్మన్లు సురేందర్‌రెడ్డి, వెంకట్రామారావు, దుర్గారెడ్డి, సెస్‌డైరెక్టర్ కొట్టెపెల్లి సుధాకర్, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమణారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.