
వేములవాడ: మధ్యవర్తిత్వం ద్వారానే కేసులకు పరిష్కారం లభిస్తుందని సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్ జాదవ్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 13న నిర్వహించే మెగా లోక్ అదాలత్‌కు సంబంధించిన సమన్వయ సమావేశాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులు, వేములవాడ న్యాయవాదులతో కోర్టు ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. మధ్యవర్తిత్వం ద్వారా ఎక్కువ కేసులను పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు.