
సాంకేతిక విద్యార్థులకు సత్వర ఉపాధి
సిరిసిల్లటౌన్: సాంకేతిక విద్యను అభ్యసించిన విద్యార్థులకు సత్వర ఉపాధి అవకాశాలు అందివస్తాయని టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖ వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ సీతారాములు పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏటీసీ కోర్సులపై కళాశాల ప్రిన్సిపాల్ కవిత ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో అవగాహన కల్పించారు. ఏడాది కోర్సులు ఇండస్ట్రియల్ రోబోటిక్స్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ టెక్నీషియన్, మ్యానుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్, రెండేళ్ల వ్యవధి కోర్సులు అడ్వాన్స్‌డ్ సీఎన్సీ మెకానిక్ టెక్నీషియన్, వర్చువల్ అనాలసిస్ అండ్ డిజైనర్, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ కోర్సులు ఉన్నట్లు తెలిపారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డీటీవో రవి, ఏటీవో శ్రీనివాస్, జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్ పాల్గొన్నారు.