
మిడ్‌మానేరులో 17 టీఎంసీలు
మా‘నీటి’లో పర్యాటకుల సందడి
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు ఇటీవల కురిసిన వర్షాలకు మత్తడి పోస్తోంది. దీంతో మా‘నీటి’ అందాలను వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. మానీటిలో కేరింతలు కొడుతున్నారు.
బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరులో నీటిమట్టం శుక్రవారం 17.079 టీఎంసీలకు చేరింది. ఎస్సారెస్పీ నుంచి 15,782, గాయత్రి పంప్‌హౌస్ నుంచి 3,150 క్యూసెక్కుల మేర నీరు తరలుతోంది. మిడ్‌మానేరు నుంచి ప్యాకేజీ–10 అనంతగరి ప్రాజెక్టులోకి 9,600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

మిడ్‌మానేరులో 17 టీఎంసీలు