
దేహదానం మహోన్నతం
సిరిసిల్ల: దేహదానం మహోన్నతమైందని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ జాటోత్ రాజేశ్వరీ అభినందించారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, సామాజిక కార్యకర్త దేహదానానికి ముందుకురాగా.. వారికి గురువారం అంగీకారపత్రాలను అందించి మాట్లాడారు. చనిపోయిన తర్వాత కాల్చడమో, పూడ్చడమో చేస్తారని, మెడికల్ కళాశాలకు దేహదానం చేయడం ద్వారా వైద్య విద్యార్థుల పరిశోధనకు ఉపయోగపడుతుందన్నారు. సిరిసిల్ల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయరఘునందన్ కుటుంబం స్ఫూర్తితో అధ్యాపకులు వాసరవేణి పర్శరాములు, చెన్నోజ్వల శశిధర్, గుమ్మడి మురళి, గుమ్మడి స్వప్న, సామాజిక కార్యకర్త దుంపెన రమేశ్ దేహదానానికి ముందుకొచ్చారు. అనాటమీ డిపార్టుమెంట్ హెడ్ అన్వర్ ఉన్నీస, డాక్టర్ అర్పిత, డాక్టర్ దివ్య తదితరులు ఉన్నారు.