
మానేరు జలాలకు కలెక్టర్, ఎస్పీ పూజలు
గంభీరావుపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పొంగిపొర్లుతుండడంతో బుధవారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బి గీతే కలిసి మానేరు జలాలకు పూజలు చేశారు. అనంతరం కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
పాడి పశువులతో ఆర్థికంగా వృద్ధి చెందాలి
పాడిపశువులను సద్వినియోగం చేసుకొని పేద కుటుంబాలు ఆర్థికంగా వృద్ధి చెందాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దేశాయిపేటలో 17 మంది లబ్ధిదారులకు మంజూరైన పాడిపశువులను పంపిణీ చేశారు.
కేసుల దర్యాప్తులో అలసత్వం వద్దు
కేసుల దర్యాప్తులో పోలీస్ అధికారులు అలసత్వం వహించొద్దని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌ను బుధవారం తనిఖీ చేశారు. రికార్డులను, కేసుల విచారణ తీసుకున్న చర్యలను పరిశీలించారు. పెట్రోలింగ్ సమయంలో రౌడీషీటర్ల కదలికలను గమనించాలన్నారు.