
రోడ్డు పనులు పరిశీలన
వేములవాడ: వేములవాడలో రాజన్న ఆలయ ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా కూల్చివేసిన ఇళ్ల వ్యర్థాలను తొలగించే ప్రక్రియను మంగళవారం విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. రాజన్న ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రహదారి విస్తరణకు రూ.47 కోట్లతో పనులు ప్రారంభించినట్లు చెప్పారు.
నష్టపరిహారం ఇప్పించండి
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం సంకెపల్లి గ్రామం మిడ్‌మానేరు ప్రాజెక్ట్టు ముంపునకు గురికాగా, 45 ఇళ్లకు నష్టపరిహారం ఇంకా రాలేదని, ఇప్పించాలని మంగళవారం విప్ ఆది శ్రీనివాస్‌ను నిర్వాసితులు కోరారు. తమకు పూర్తిస్థాయిలో పరిహారం అందించేలా చూడాలని కోరారు. చింతపల్లి శ్రీనివాస్‌రావు, రగుడు పర్శరాములు, మారవేణి రాజు తదితరులు ఉన్నారు.
డీఎంహెచ్‌వో సందర్శన
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశాల మేరకు మంగళవారం డీఎంహెచ్‌వో ఎస్.రజిత మండలంలోని ఇందిరమ్మకాలనీని సందర్శించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించారు. నివాసాల చుట్టూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డెంగీ నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించి జ్వర బాధితులకు చికిత్స అందించాలని ఆదేశించారు. మలేరియా ప్రోగ్రాం అధికారి అనిత తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అంతటా తుంపర్లు
సిరిసిల్ల: జిల్లాలో మంగళవారం తుంపర వర్షం కురిసింది. వీర్నపల్లి మండలంలో అత్యధికంగా 6.9 మి.మీటర్ల వర్షం పడగా.. రుద్రంగి 4.8, చందుర్తి 4.1, వేములవాడరూరల్ 6.4, బోయినపల్లి 5.0, వేములవాడ 4.4, సిరిసిల్ల 4.8, కోనరావుపేట 3.3, ఎల్లారెడ్డిపేట 3.1, గంభీరావుపేట 2.7, ముస్తాబాద్ 4.3, తంగళ్లపల్లి 3.9, ఇల్లంతకుంటలో 3.5 మి.మీ వర్షం కురిసింది.
యూరియా అక్రమ రవాణాపై నిఘా
సిరిసిల్లక్రైం: జిల్లాలో యూరియా అక్రమ రవాణాపై నిఘా కఠినతరం చేసినట్లు ఎస్పీ మహేశ్ బీ గితే మంగళవారం పేర్కొన్నారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ల వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు చేస్తున్నట్టు తెలిపారు. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. యూరియా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెక్ పోస్ట్‌ల్లో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు.

రోడ్డు పనులు పరిశీలన

రోడ్డు పనులు పరిశీలన