
ఎరువుల కొరత లేదు
రెండో దఫా నానో యూరియా పిచికారీ చేస్తే మేలు
మోతాదుకు మించి వాడొద్దు
డీఏపీలోనూ నత్రజని ఉంటుంది
యూరియా అందలేదా.. వ్యవసాయాధికారులను సంప్రదించాలి
‘సాక్షి’తో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం
వ్యవసాయాధికారులను సంప్రదించాలి
సిరిసిల్ల: ‘వర్షాలు కాస్త ఆలస్యంగా రావడంతో రైతులందరూ ఒకేసారి యూరియా కావాలని ముందుకు వస్తున్నారు.. జిల్లాలో వానాకాలం పంట కాలానికి సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి. అపెరల్ పార్క్ గోదాములో వంద మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఉంది.. రైతులు పంటకు రెండో దఫాగా నానో యూరియా పిచికారీ చేసుకుంటే మేలు’.. అని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం అన్నారు. కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలో పంటల సాగు, ఎరువుల వినియోగం, ఆధునిక పద్ధతులను వివరించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
నిజంగా ఎవరైన రైతులకు జిల్లాలో యూరియా, ఇతర ఎరువులు అవసరమైతే ఆందోళన చెందకుండా.. నేరుగా ఆయా మండలాల వ్యవసాయాధికారులను సంప్రదించాలి. మండల వ్యవసాయాధికారులు వారి పరిధిలో ఎరువులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో రైతులకు చెబుతారు. ఈ మేరకు రైతులు నేరుగా ఎరువులు పొందవచ్చు.

ఎరువుల కొరత లేదు