
రాజీ పడే కేసులను గుర్తించండి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ
సిరిసిల్లకల్చరల్: రాజీ పడే కేసులను గుర్తించి లోక్ అదాలత్‌లో పరిష్కరించుకునేలా కృషి చే యాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ సూచించారు. జిల్లా న్యాయస్థానంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా జడ్జీ నీరజ మాట్లాడారు. రాజీ కుదుర్చుకోగలిగే కక్షిదారులను సమన్వయం చేసి కేసుల పరిష్కారానికి దోహదం చేయాలన్నారు. న్యాయవాదులు, పోలీసు అధికారులు సమన్వయంతో లోక్ అదాలత్‌లో వీలైనన్ని కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించారు. జిల్లా అదనపు న్యాయమూర్తి వి.పుష్పలత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జ్జి పి.లక్ష్మణాచారి, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జ్జి ఎ.ప్రవీణ్, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్జ్జి గడ్డం మేఘన, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్, అడిషనల్ పీపీ చెలుమల సందీప్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ ఎస్పీకి అభినందనలు
సిరిసిల్లక్రైం: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రెసిడెంట్ మెడల్ అందుకున్న అడిషనల్ ఎస్పీ చంద్రయ్యను జిల్లా జడ్జ్జ్జి నీరజ అభినందించారు. కోర్టు ఆవరణలో సోమవారం పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు. అడిషనల్ ఎస్పీ చంద్రయ్య విధుల్లో చూపిన తెగువ, దీర్ఘకాలికంగా ప్రజలకు అందించిన సేవలను గు ర్తించిన ప్రభుత్వం మెడల్‌కు ఎంపిక చేసింది.
యూరియా సరఫరాపై నిఘా
సిరిసిల్ల: వానాకాలం పంటల సాగుకు అవసరమైన యూరియా మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని, వచ్చే సీజన్ కోసం నిల్వ చేయొద్దని ఎస్పీ మహేశ్ బి గీతే కోరారు. కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సోమవారం సమీక్షించారు. యూరియాను పరిశ్రమలకు, పొరుగు జిల్లాలకు తరలించకుండా నిఘా ఉంచాలని సూచించారు. మోతాదుకు మించి వినియోగించొద్దని కోరారు. అంతకు ముందు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావులతో కలిసి యూరియా, ఎరువుల లభ్యతపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, జిల్లా సహకార అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
హోంగార్డుకు ఆర్థిక సాయం
సిరిసిల్లక్రైం: జిల్లాలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న శివకుమార్‌కు జిల్లా పోలీస్ యంత్రాంగం బాసటగా నిలిచింది. రూ.55వేలు జమచేసి ఆయన కుటుంబ సభ్యులకు సోమవారం ఎస్పీ మహేశ్ బీ గీతే చేతులమీదుగా అందించారు. తోటి సిబ్బంది ఆపదలో ఉన్నప్పుడు ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు. ఆర్‌ఐలు యాదగిరి, రమేశ్, శివకుమార్ పాల్గొన్నారు.
బాధితులకు భరోసాగా గ్రీవెన్స్ డే
సమస్యల పరిష్కారం లక్ష్యంగా, బాధితులకు భరోసాగా ఉండేందుకు ప్రతీ సోమవారం గ్రీవె న్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 23 ఫిర్యాదులు స్వీకరించినట్లు వివరించారు. ఆయా పో లీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్‌చేసి సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు.
సిరిసిల్లటౌన్: పర్యావరణ పరిరక్షణలో అంద రూ భాగస్వాములు కావాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కోరారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో సోమవారం తె లంగాణ భవన్‌లో విత్తన గణపతి విగ్రహాల పంపిణీ చేపట్టారు. ఆగయ్య మాట్లాడుతూ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా విత్తన గణపతి విగ్రహాలను పార్టీ నాయకులకు అందజేశారు. చీటి నర్సింగరావు, గూడూరి ప్ర వీణ్‌కుమార్, ఆకునూరి శంకరయ్య, కుంబాల మల్లరెడ్డి, కోడి అంతయ్య, కమల్‌గౌడ్ పాల్గొన్నారు.

రాజీ పడే కేసులను గుర్తించండి

రాజీ పడే కేసులను గుర్తించండి