
ప్రేమను పంచడమే దైవత్వం
సిరిసిల్లటౌన్: స్వార్థంతో కోరికలు తీరాలని కోరుకో వడం కన్నా..సకల చరాచర జాతులపై ప్రేమను పంచడం దైవత్వమని సైకాలజిస్టు అన్నమైన మల్లేశం పేర్కొన్నారు. భగవాన్ శ్రీసత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సిరిసిల్ల సత్యసాయి సేవా మందిరంలో బాలవికాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. సమ్మేళనంలో గత ముప్పై ఏళ్లుగా సంస్థకు అనుబంధంగా పూర్వ బాలవికాస్ విద్యార్థిని, విద్యార్థులు హాజరై ఆనందాన్ని వ్యక్తం చేశారు. సనాతన అనాలైటిక్స్ స్పీకర్ రంగనాథరాజు, సమితి జిల్లా అధ్యక్షుడు బూర రవీందర్ పాల్గొన్నారు.