మైన్స్‌ డీడీపై లోకాయుక్తలో ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

మైన్స్‌ డీడీపై లోకాయుక్తలో ఫిర్యాదు

Aug 9 2026 2:40 AM | Updated on Aug 9 2026 2:40 AM

కేసు పెండింగ్‌లో ఉండగా ఏడీ నుంచి డీడీగా ప్రమోషన్‌ ఇవ్వడంపై అభ్యంతరం

బానిసల కంటే ఘోరంగా కార్మికుల బతుకులు

సంతనూతలపాడు దీక్షా శిబిరంలో బూచేపల్లి, పక్కన వెంకాయమ్మ, డాక్టర్‌ మేరుగు

మర్రిపూడిలో ఆదిమూలపు సురేష్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్న

బూచేపల్లి వెంకాయమ్మ, పక్కన శివప్రసాద్‌రెడ్డి, తూమాటి మాధవరావు

దర్శి దీక్షలో పాల్గొన్న బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్‌రెడ్డి

మార్కాపురంలో దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు,

నాయకులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: పెండింగ్‌ కేసు ఉండగా పదోన్నతి ఇవ్వడంపై జిల్లా గనులు, భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ టీ రాజశేఖర్‌పై లోకాయుక్తలో ఒకరు ఫిర్యాదు చేశారు. రాజశేఖర్‌ నెల్లూరు జిల్లాలో ఏడీగా పనిచేసే సమయంలో ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో ఆయన ఏ–5గా ఉన్నారు. ఒక గ్రానైట్‌ క్వారీలో పెట్టుబడులు పెట్టించి యజమానికే తెలియకుండా క్వారీని అన్యాక్రాంతం చేయటం, పెట్టుబడులను మళ్లించడం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు క్వారీ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో 2023 మే 11వ తేదీ వివిధ సెక్షన్ల కింద రాజశేఖర్‌పై కేసు నమోదైంది. ఆ కేసు పెండింగ్‌లో ఉండగానే డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి ఇచ్చారు. కేసు పెండింగ్‌లో ఉండగా కీలకమైన గనుల శాఖ డీడీగా పదోన్నతి ఎలా ఇచ్చారని పంగులూరు గ్రామానికి చెందిన పులిపాటి హేబేలు ఏపీ లోకాయుక్తలో రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ప్రముఖ అడ్వొకేట్‌ జడా శ్రావణ్‌ కుమార్‌ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. దానిపై వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్‌లో ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.

ఒంగోలు టౌన్‌: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్‌ కోడ్లతో దేశంలోని కార్మికుల బతుకు బానిసల కంటే ఘోరంగా తయారైందని, రోజుకు 8 గంటలకు బదులుగా 12 గంటలు పనిచేయించుకుంటున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మల్లయ్యలింగం భవనంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో శనివారం కార్మిక సంఘాల ఉమ్మడి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జైలు భరో కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం కొత్తకోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న 29 చట్టాలను మోదీ ప్రభుత్వం ఒక్క కలం పోటుతో రద్దు చేయడంతో కార్మికులు హక్కులను కోల్పోయారని తెలిపారు. సమావేశంలో కాలం సుబ్బారావు, మహేష్‌, ప్రభాకర్‌, శ్రీరామ శ్రీనివాసరావు, ఎంఏ సాలార్‌, ఎస్‌.సాయి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement