దగా డీఎస్సీ
దర్శిలో నిరాహార దీక్షలో మాట్లాడుతున్న బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్‌రెడ్డి
టంగుటూరు దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న డాక్టర్ ఆదిమూలపు సురేష్
మార్కాపురంలో దీక్షకు మద్దతు తెలుపుతున్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, అన్నా రాంబాబు
మెగా డీఎస్సీ స్కాంపై వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలతో ఉమ్మడి జిల్లా హోరెత్తిపోయింది. అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినదించారు. చంద్రబాబు ప్రభుత్వం దిగివచ్చేంత వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రతినబూనారు. శుక్రవారం రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వైపాలెం ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కేపీ నాగార్జునరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు చుండూరి రవిబాబు, చింతలపూడి అశోక్‌కుమార్, దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు.
– సాక్షి నెట్‌వర్క్


