పోలీసుల అత్యుత్సాహం | - | Sakshi
Sakshi News home page

పోలీసుల అత్యుత్సాహం

Aug 8 2026 2:05 AM | Updated on Aug 8 2026 2:05 AM

పోలీసుల అత్యుత్సాహం

ఒంగోలు సిటీ: డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు తలపెట్టిన రిలే నిరాహార దీక్షలను అడ్డుకునేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అద్దంకిలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని శుక్రవారం పోలీసులు తొలగించారు. దీంతో దీక్షా శిబిరాన్ని అద్దంకి వైఎస్సార్‌ సీపీ ఆఫీసుకు తరలించారు. అదేవిధంగా కందుకూరులో వైఎస్సార్‌ సీపీ దీక్షా శిబిరం వద్ద పోలీస్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రిలే దీక్షలు చేస్తున్న అభ్యర్థులు నీడ కోసం దీక్షా శిబిరం వద్ద టెంట్‌లు వేసుకునేందుకు కూడా పోలీసులు అనుమతించ లేదు. దీంతో ఎండ తీవ్రత దృష్ట్యా గొడుగులు వేసుకుని దీక్షను కొనసాగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement