396 మందిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు | - | Sakshi
Sakshi News home page

396 మందిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు

Aug 2 2026 1:58 AM | Updated on Aug 2 2026 1:58 AM

ఒంగోలు టౌన్‌: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 396 మందిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా 12.62 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు ఎస్పీ హర్షవర్థన్‌రాజు తెలిపారు. అదేవిధంగా బహిరంగంగా మద్యం సేవించిన 2,669 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. బహిరంగంగా మద్యం సేవించిన 853 ప్రదేశాలను వారితోనే శుభ్రం చేయించినట్లు తెలిపారు. 11,127 ఈ చలానాల ద్వారా మోటారు వాహన చట్టం కింద ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు వివరించారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో జూలై 1 నుంచి 31వ తేదీ వరకు నేర గణాంకాలకు సంబంధించిన వివరాలను స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఎస్పీ విడుదల చేసి విశ్లేషించారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా 3 కేసులు నమోదు చేసి 11 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 8.890 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. కోడి పందేలు, పేకాట, మట్కా తదితర జూదాలపై దాడులు నిర్వహించి 239 మందిని అదుపులోకి తీసుకున్నామని, 45 కేసులు నమోదు చేసి వారి వద్ద నుంచి 12,43,870 రూపాయల నగదు, 5 కోళ్లు, 37 మోటారు సైకిళ్లు, 48 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాలో 922 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌ నిర్వహించినట్లు చెప్పారు. రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న 3,581 మంది చిరువ్యాపారులపై టౌన్‌ న్యూసెన్స్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసి కోర్టులో జరిమానాలు, శిక్షలు విధించినట్లు వివరించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వ హిస్తూ చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తమ పరిధి లోని గ్రామాలు, వార్డులను సందర్శించి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటు, మహిళా చట్టాలు, గంజా యి, ఇతర మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలు, చట్టపరమైన శిక్షల గురించి అవగాహన కల్పించినట్లు చెప్పారు. సైబర్‌ నేరాలు, లోన్‌ యాప్స్‌, క్రికెట్‌ బెట్టింగులు, రహదారి నియమాలు, హెల్మెట్‌ వినియోగం, కొత్త చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటుగా చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

3,581 మంది చిరువ్యాపారులపై న్యూసెన్స్‌ కేసులు

బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై 2,669 కేసులు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జూలై నెల నేర గణాంకాలు విడుదల చేసిన ఎస్పీ హర్షవర్థన్‌రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement