
బూచేపల్లి వెంకాయమ్మకు శుభాకాంక్షలు
చీమకుర్తి: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. చీమకుర్తిలో నిర్వహించిన వేడుకల్లో కుమారుడు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, వారి కుటుంబసభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున, పార్టీ ఒంగోలు
పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు ఇన్‌చార్జి చుండూరు రవి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న బూచేపల్లి వెంకాయమ్మను గజమాలలతో సత్కరించి
శాలువాలు కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు,
అభిమానులు భారీగా తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.