
మోసం చేయడం బాబు నైజం
నాగులుప్పలపాడు: ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. మండలంలోని చవటపాలెం, చేకూరపాడు గ్రామాల్లో మంగళవారం బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మేరుగు నాగార్జున మాట్లా డుతూ చంద్రబాబు మాయమాటలు, అబద్ధపు హామీ లు నమ్మి ప్రజలు నిలువునా మోసపోయారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని ఇంత వరకు సక్రమంగా అమలు చేయలేదన్నారు. ప్రతి పనికి దోచుకోవడం, దాచుకోవడం చందాన టీడీపీ నాయకులు అవినీతి కూపంలో కూరుకుపోయారన్నారు. ఏ పనిచేసుకోలేని దివ్యాంగుల పెన్షన్‌ను అన్యాయంగా తొలగిస్తూ చంద్రబాబు వారి ఊసురుపోసుకుంటున్నాడని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం చేతకాక రోజుకో డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. పొగాకు, మిర్చి రైతులను చంద్రబాబు చేసిన మోసం వారు జీవితంలో మరచిపోరన్నారు. బర్లీ పొగాకు కొనుగోళ్లలో పార్టీలు చూసి కోనుగోలు చేస్తున్న ఈ ప్రభుత్వ తీరును ప్రజలు ఛీదరించుకుంటున్నారన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో జగనన్న మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించడంతో పొగాకు బోర్డు చరిత్రలో ఎన్నడూ చూడని ధరలు పలికి రైతులు ఎంతో లాభపడ్డారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రైతులంతా నష్టాల పాలై సాగుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో అర్హతే ప్రామాణికంగా ఎవరి సిఫార్సు లేకుండా పథకాలు అందించారన్నారు. చంద్రబాబు నిరంకుశ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ప్రజలంతా తిరగబడాలని పిలుపునిచ్చారు. అనంతరం బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ క్యూ ఆర్ కోడ్‌ను నాయకులతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్ర నాయకులు నలమలపు కృష్ణారెడ్డి, రైతు విబాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ల బంగారుబాబు, మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, మేధావుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కంచర్ల సుధాకర్, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావు, మండల ఉపాధ్యక్షుడు కాటూరి ఆదియ్య, కాకర్ల వెంకటేష్, మండల యూత్ అధ్యక్షుడు ఇమ్మిశెట్టి బాలకృష్ణ, మండల మహిళా అధ్యక్షురాలు పోకూరి లక్ష్మీ, పోకూరి హరిబాబు, చంద్రయ్య, గోపిరెడ్డి, చవటపాలెం గ్రామ సర్పంచ్ కాట్రగడ్డ వనజ శ్రీనివాసరావు, ఎంపీటీసీ సంతోష్, ఈదర శ్రీకాంత్, ఎండ్లూరి సుధీర్ పాల్గొన్నారు.
గ్రామ కమిటీలు ఎంపిక
చవటపాలెం గ్రామ అధ్యక్షునిగా ఆర్ జగదీష్, ఉపాధ్యక్షులుగా జిలకర ప్రేమ్‌చంధ్, బక్కా రవికాంత్, ప్రధాన కార్యదర్శిగా మాణిక్యరావు, అభి, సుధాకర్‌రావు పాటు మరో 12 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.
చంద్రబాబు మాయ మాటలతో రాష్ట్రం దివాలా
బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున