ఓడించామని కక్ష సాధింపు | - | Sakshi
Sakshi News home page

ఓడించామని కక్ష సాధింపు

Aug 27 2025 8:16 AM | Updated on Aug 27 2025 8:16 AM

ఓడించామని కక్ష సాధింపు

ఓడించామని కక్ష సాధింపు

ముండ్లమూరు(దర్శి): అసెంబ్లీ ఎన్నికల్లో గొట్టిపాటి లక్ష్మీని ప్రజలు ఓడించడంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ చింతా శ్రీనివాసరెడ్డి అన్నారు. పసుపుపల్లు గ్రామంలో తనకు జరిగిన అన్యాయంపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన వివరాలు వెల్లడించారు. తనకు తన సోదరి భర్త రత్నారెడ్డి పేరుపై గ్రామ ప్రధాన సెంటర్‌ కూడలిలో రెండు సెంట్ల స్థలం ఉందని, వ్యాపారానికి అనుకూలంగా ఉండే ఆ స్థలంలో గత 25 ఏళ్లుగా రేకుల షెడ్‌లలో దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే మంగళవారం తెల్లవారుజామున సుమారు 50 మంది పోలీసులకు వచ్చి దౌర్జన్యానికి దిగారన్నారు. దర్శి ఎస్సై మురళీ, ముండ్లమూరు ఎస్సై కమలాకర్‌, తాళ్లూరు ఎస్సై మల్లికార్జున్‌లు అక్కడకు వచ్చి ఎవరికీ చెప్పకుండా రేకుల దుకాణాలను కూల్చివేసేందుకు బీభత్సం సృష్టించారని చెప్పారు. మహిళలన్న గౌరవం కూడా లేకుండా వారిపై కూడా దౌర్జన్యం చేశారన్నారు. సీఐ రామారావు ఖాకీ దుస్తులు వేసుకున్న విషయం కూడా మరిచిపోయి అడ్డొస్తే కేసులు పెడతాం అంటూ చిందులు తొక్కి మహిళలని కూడా చూడకుండా రోడ్డుపైకి లాక్కెళ్లి దౌర్జన్యాన్ని ప్రదర్శించారని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామంలో మెజార్టీ వచ్చిందనే కూల్చివేత..

అసెంబ్లీ ఎన్నికల్లో పసుపుగల్లు గ్రామంలో 248 ఓట్లు మెజార్టీ వచ్చిందని, నాలుగు బూత్‌లలో వైఎస్సార్‌ సీపీకి మెజారిటీ రావడంతో సహించలేక గొట్టిపాటి లక్ష్మీ మమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని కంకణం కట్టుకుందన్నారు. గొట్టిపాటి లక్ష్మీ చెప్పిందని బిజ్జం సుబ్బారెడ్డి గ్రామంలో ఈ పనిచేయిస్తున్నాడన్న విషయం గ్రామంలో అందరికీ తెలుసన్నారు. ఈ స్థలాన్ని నరసింహ స్వామి దేవస్థానానికి ఇస్తామని చెప్పామని, దేవునికి భూమి ఇస్తే గౌరవం వస్తుందని, ఆ గౌరవం దక్కకుండా ఉండాలని దౌర్జన్యంగా భూమి ఆర్‌అండ్‌బీదిగా చెప్తున్నారన్నారు. పంచాయతీ కార్యదర్శి ఎంపీపీకి, సర్పంచులు, మెంబర్లకు తెలియకుండా సంతకాలు పెట్టి తప్పుడు తీర్మానం తయారు చేశారన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది మందికి సాయం చేసి పేరు తెచ్చుకోవాలని, ఇలా దౌర్జన్యాలు, పోలీసులను అడ్డుపెట్టుకొని కొంపలు కూల్చితే ప్రజలు రానున్న రోజుల్లో మరోసారి బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఇటీవల తూర్పు వీరాయపాలెం గ్రామంలో ముప్పరాజు శ్రీను నివాసాన్ని ఎటువంటి నోటీసులు లేకుండా పోలీసులను మొహరించి కూల్చివేశారని, మాకూ ఎటువంటి నోటీసులు లేకుండా తెల్లవారుజామునే వచ్చి దుకాణాలు కూల్చివేశారని చెప్పారు. పాలన అంటే పది మందికి సాయం చేసే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.

పోలీసులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు

మహిళలను కూడా ఈడ్చి పడేశారు

ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అల్లర్లు

వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ చింతా శ్రీనివాసరెడ్డి ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement