
డబ్బులిచ్చుకో.. మద్యం అమ్ముకో!
● ఎకై ్సజ్ సిబ్బంది తీరుపై ఆరోపణలు
తర్లుపాడు: గ్రామాల్లో బెల్టు షాపులు ఏర్పాటు చేసి అందిన కాడికి దండుకుంటున్న మద్యం మాఫియాకు ఎకై ్సజ్ అధికారులు, సిబ్బంది అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువారం తర్లుపాడులో ఎకై ్సజ్ అధికారులు వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. ఎకై ్సజ్ సీఐ ఆధ్వర్యంలో తర్లుపాడు వచ్చిన సిబ్బంది ఓ కిరాణా షాపు వద్ద మద్యం తాగుతున్న వ్యక్తులపై బెదిరింపులకు దిగారు. ఆధార్ కార్డు చూపాలంటూ మభ్యపెట్టి వసూళ్లకు యత్నించారు. అటుగా వెళ్తున్న కొందరు విలేకరులు ఏం జరిగిందంటూ ఆరా తీయగా సీఐ, సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఇదిలా ఉండగా ఎకై ్సజ్ సిబ్బంది గ్రామాల్లో నెలవారీ మామూళ్లు వసూలు చేసి పైఅధికారులకు చేరవేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాలో ఆ శాఖ డ్రైవర్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
మార్కాపురం: మార్కాపురం ఆర్టీసీ డిపో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. కొందరు మందుబాబులు బస్టాండ్‌లో నీళ్ల కుళాయిల వద్ద దర్జాగా మద్యం తాగుతున్నారు. గ్లాసుల్లో కుళాయి నీరు పట్టుకుని, అక్కడే మందు కలుపుకొని తాగేస్తుండటాన్ని చూసి ప్రయాణికులు నివ్వెరపోతున్నారు. దీనిపై మార్కాపురం ఆర్టీసీ డీఎం నరసింహులును వివరణ కోరగా.. మందుబాబుల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

డబ్బులిచ్చుకో.. మద్యం అమ్ముకో!