
అగ్నివీర్‌కు 159 మంది అర్హత
తిరుపతి రూరల్: అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ రాత పరీక్షలో ఎస్వీ డిఫెన్స్ అకాడమికి చెందిన 159 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు అకాడమి చైర్మన్ బీ శేషారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉచితంగా ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చామని, వారు ఉద్యోగంలో చేరడానికి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. అంతకుముందు 159 మంది విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
ఒంగోలు: జిల్లా ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపిక ఆదివారం స్థానిక డాక్టర్ పర్వతరెడ్డి ఆనంద్ మినీ స్టేడియంలో నిర్వహించారు. ఎంపిక ప్రక్రియను ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ చైర్మన్ కె.సాయి మనోహర, వ్యవస్థాపక అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు పర్యవేక్షించారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 30న భీమవరం వెస్ట్ బెర్రీ పాఠశాలలో జరిగే అండర్ 17 క్యాడెట్ 11వ రాష్ట్రస్థాయి పోటీలలో ప్రకాశం జిల్లా తరుపున పాల్గొంటారని జిల్లా ఫెన్సింగ్ ముఖ్య కార్యదర్శి జి.నవీన్ తెలిపారు.
ఎంపికై న బాలురు..
పి.అంబరీష్, కె.జగదీష్, ఎండీ అబ్దుల్, ఎస్.సంతోష్(ఈపీ), కె.దరహాస్, ఎస్‌కే అదిల్, బి.ఈశ్వర్, ఎం.యతిన్ శ్రీకార్తికేయ(ఫాయిల్), ఈ.తనూజ్, పి.నిఖిల్, టి.అభినవ్ బుద్ద, కె.తారక్‌రామ్(సాబ్రే)
ఎంపికై న బాలికలు:
ఎస్‌కె ఫిర్దోన్ తాన్‌వీర్, ఎం.మనస్వి(ఈపీ), పి.లిఖితరెడ్డి(ఫాయిల్), పి.చక్రిక, ఈ.మహిత, వి.లేఖన(సాబ్రే)
ఒంగోలు సిటీ:
2004కు ముందు నియామక ప్రక్రియ ప్రారంభించిన ఉపాధ్యాయులు, ఉద్యోగ, పోలీసులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 25వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ అలంకార్ సెంటర్‌లో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ అబ్దుల్ హై, డి వీరాంజనేయులు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. 2003 డీఎస్సీ టీచర్స్ ఫోరం చేపట్టిన మహా ధర్నాకు జిల్లా శాఖ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందన్నారు. జిల్లాలోని యూటీఎఫ్ కార్యకర్తలు భారీ ఎత్తున మహా ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

అగ్నివీర్‌కు 159 మంది అర్హత