
బీసీ వసతి గృహంలో దారుణమైన పరిస్థితులు
● బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ డైరక్టర్
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలపై ఃసాక్షిలో వచ్చిన కథనానికి స్పందించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ డైరక్టర్ బత్తుల పద్మావతి సోమవారం సాయంత్రం ఒంగోలు మంగమూరు రోడ్డులోని బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైరక్టర్ అనేక విషయాలను గుర్తించారు. పిల్లలతో ముచ్చటించారు. వసతి గృహంలో విద్యార్థులంతా నేలపైనే పడుకుంటున్నారని, తగినన్ని బాత్రూంలు లేవన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలేదని భోజనాన్ని పరిశీలించారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులకు సరైన మందులు ఇవ్వడంలేదని, గడువు తీరిన మందులను కూడా గుర్తించారు. కరెంటు స్విచ్ బోర్డులు పాడైపోయి, పగిలిపోయాయన్నారు. విద్యార్థులకు అందే విధంగా స్విచ్ బోర్డులు ఏర్పాటు చేయడం దారుణమన్నారు. విద్యార్థుల వసతి గృహం పైనే రెండు కంపెనీలకు సెల్ టవర్‌లను ఏర్పాటు చేయడం ఎంత వరకు సబబన్నారు.