సామాజిక ధర్మాన్ని పాటించి.. సీఎం జగన్‌ మమ్మల్ని తలెత్తుకునేలా చేశారు

YSRCP Samajika Sadhikara Bus Yatra Guntur Updates - Sakshi

సాక్షి, గుంటూరు:  జగనన్న పాలనలో సామాజిక సాధికారిత యాత్ర ద్వారా రాష్ట్రానికి జరిగిన మేలును ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్‌సీసీ సిద్ధమైంది. గురువారం సాయంత్రం తెనాలి రూరల్ కొలకలూరులోని బాపయ్యపేట నుంచి సామాజిక సాధికార బస్సుయాత్ర ప్రారంభమైంది. 

రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, మంత్రులు ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, ఎమ్మెల్యేలు అన్నాబత్తుని శివకుమార్, హఫీజ్ ఖాన్,మాజీ ఎంపీ బుట్టా రేణుక , గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, పోతుల సునీత, కల్పలతారెడ్డి, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి తదితరులు జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు. బస్సుయాత్ర ప్రారంభించిన అనంతరం కొలకలూరులో కుమ్మర,శాలివాహనులతో మంత్రులు మీడియాతో ముఖాముఖి నిర్వహించారు. 

కోస్తాంధ్రలో మొట్టమొదటి సామాజిక యాత్ర భేరి మోగించబోతున్నాం. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సామాజిక ధర్మాన్ని జగన్ మోహన్ రెడ్డి పాటించారు. నాలుగున్నరేళ్లలో దమ్ముగా మేం తల ఎత్తుకునేలా చేశారు. మాకు జగన్ మోహన్ రెడ్డి అనే ఒకే ఒక్క నాయకుడున్నాడు. సామాజిక సాధికారిత ద్వారా 175 నియోజకవర్గాల్లో మాకు జరిగిన మేలును వివరిస్తాం. చంద్రబాబు పాపం పండింది. 40 ఏళ్లలో చేసిన అవినీతి బయటపడింది. నారా భువనేశ్వరి నిజం గెలవాలంటూ రోడ్డెక్కారు. నిజం గెలిచింది...నిజం నిగ్గు తేలింది.. కాబట్టే చంద్రబాబు బొక్కలో ఉన్నాడు. 40 ఏళ్లలో చంద్రబాబు వెన్నంటే ఉన్న మీరే చంద్రబాబు పాపాలు చెప్పాలి. వెన్నంటే ఉండి మీ తండ్రికి ఎలా వెన్ను పోటు పొడిచాడో మీరు చెప్పాలి. రెండు ఎకరాలతో రెండు లక్షలు ఎలా దోచుకున్నారో మీరు చెప్పాలి. పేదల కోసం జగన్ మోహన్ రెడ్డి ఏం చేశారో మేం చెప్తాం రెఢీనా?
:::మంత్రి జోగిరమేష్ 

అనునిత్యం ప్రజల వద్దకే పాలన అనేది జగన్ మోహన్ రెడ్డి ఆలోచన. ఈ నాలుగున్నరేళ్లలో బడుగు,బలహీన వర్గాల స్థితి గతులు ఎలా మారాయో ఈ యాత్రలో చెబుతాం. పేదలకు జరిగిన మేలును చెప్పేందుకు మేం యాత్ర చేస్తున్నాం. ఓ రిమాండ్ ఖైదీ కోసం టీడీపీ నేతలు రోడ్డెక్కారు. తమ వ్యాపారాల కోసం.. గుట్టు బయటపడకుండా ఉండాలనేదే వారి తాపత్రయం. కుంభకోణాలతో చంద్రబాబు అవినీతి పాలన అందించారు. అవినీతి లేకుండా జవాబుదారీగా పాలనను జగనన్న అందించారు. జగనన్న తీసుకొచ్చిన సంస్కరణలను ప్రజలకు వివరిస్తాం. పేదలకు ఇంగ్లీష్ మీడియం అవసరమా అని ఒకరంటారు. యూ ట్యూబ్ ద్వారా ఇంగ్లీష్ నేర్చికోవచ్చని మరొకరంటారు. పవన్ కళ్యాణ్ కు ఇదే నా సవాల్. పవన్ కు దమ్ముంటే మా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలతో పోటీగా ఇంగ్లీష్ మాట్లాడాలి. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ ఒక్క ఉపకులాలను కూడా విస్మరించకుండా న్యాయం చేశారు. మీకు మంచి జరిగితేనే ఓటేయమని దమ్ముగా అడుగుతున్నాం
:::మంత్రి ఆదిమూలపు సురేష్

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top