కాపులను దగా చేసింది చేసింది బాబు, పవన్‌ కాదా?: పేర్ని నాని

YSRCP Perni Nani Fires On Janasena Pawan Kalyan TDP Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కోసమే పవన్‌ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టాడని ధ్వజమెత్తారు మాజీ మంత్రి పేర్ని నాని. రైతులకు పరామర్శ పేరుతో చంద్రబాబుకు అనుకూల రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. 6 నెలలకు ఒకసారి పవన్ రోడ్డుపైకి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో కూడా పవన్ విమర్శించేవాడని దుయ్యబట్టారు. విమర్శలు చేసేందుకే ఇప్పుడు మళ్లీ రోడ్డుపైకి వస్తున్నాడని ఫైర్ అయ్యారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు.

'జనం కోసం పట్టుమని 10 రోజుల పనిచేశావా పవన్‌? కాపులను బీసీల్లో చేరుస్తామని హమీ ఇచ్చిన చంద్రబాబు మోసం చేశాడు. చంద్రబాబు కాపులను మోసం చేస్తుంటే ఎందుకు ప్రశ్నించడం లేదు. చంద్రబాబు ముద్రగడ కుటుంబాన్ని హింసించారు. కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పోరాడితే దాడి చేశారు. ఆనాడు పవన్‌ కల్యాణ్ ఎందుకు నోటికి తాళం వేసుకున్నాడు. చంద్రబాబులా కాపులను మోసం చేయనని జగన్ ముందే చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే రిజర్వేషన్లు ఉంటాయని నిజాయితీగా చెప్పారు. కాపులను దగా చేసింది చేసింది చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాదా? కాపులను పవన్ కల్యాణ్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు.

భీమ్లానాయక్ సినిమాకు ఏపీలో నష్టాలు వచ్చాయంటున్నాడు. సినిమా బాగుంటేనే జనం చూస్తారు. లేదంటే చూడరు. రూ.100 కోట్లు దాటిన పవన్ కల్యాణ్ సినిమా ఏదైనా ఉందా? రూ.100 కోట్ల మార్కెట్టే లేనప్పడు రూ.30కోట్ల నష్టం ఎలా వస్తుంది? డబ్బింగ్, కాపీ సినిమాలు తీస్తే ఎవరు చూస్తారు? రాజకీయాల్లో కుల ప్రస్తావన తెచ్చింది పవన్ కల్యాణ్ కాదా? కుల ప్రస్తావన లేకుండా ఒక్కరోజైనా మాట్లాడారా? చంద్రబాబును తిడితే మాత్రమే పవన్‌కు మానవత్వం పొంగిపొర్లుతుందా? టీడీపీ నేతలు నీ గురించి బరి తెగించి మాట్లాడితే ఏం చేశావ్? మీరిద్దరు కలిసిపోతారు, కలిసి పోటీ చేయాలని మొదటి నుంచి  చెబుతున్నాం. చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఒకటే.

ప్రజలు అవకాశం ఇచ్చేవరకు పోరాటం చేస్తూనే ఉండాలి. చంద్రబాబు హయాంలో ఆలయాలను ధ్వంసం చేస్తే ఏం చేశావ్? కుల, మత రాజకీయాలతో పవన్ పబ్బం గడుపుతున్నాడని అని నాని ధ్వజమెత్తారు.
చదవండి: పవన్‌ శ్వాస, ధ్యాస బాబే

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top