సాక్షి, అనకాపల్లి: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు చేదు అనుభవం ఎదురైంది. అనిత సొంత నియోజకవర్గంలోనే మహిళలు.. ఆమెపై తిరగబడ్డారు. పలు సమస్యలపై అనితను స్థానికులు నిలదీశారు. దీంతో, అక్కడ స్వల్ప వాగ్వాదం, ఉద్రిక్తత చోటుచేసుకున్నట్టు తెలిసింది.
తెలిసిన వివరాల మేరకు.. హోంమంత్రి అనిత, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా మంత్రులను స్థానికులు నిలదీశారు. తమ భూములు తీసుకుని పరిహారం ఇవ్వలేదని మూలపేట గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ క్రమంలో నిలదీసిన మహిళలను మంత్రి అనిత కట్టడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో, అక్కడ గందరగోళు పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.


