breaking news
mulapet
-
హోంమంత్రి అనితకు చేదు అనుభవం
సాక్షి, అనకాపల్లి: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు చేదు అనుభవం ఎదురైంది. అనిత సొంత నియోజకవర్గంలోనే మహిళలు.. ఆమెపై తిరగబడ్డారు. పలు సమస్యలపై అనితను స్థానికులు నిలదీశారు. దీంతో, అక్కడ స్వల్ప వాగ్వాదం, ఉద్రిక్తత చోటుచేసుకున్నట్టు తెలిసింది.తెలిసిన వివరాల మేరకు.. హోంమంత్రి అనిత, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా మంత్రులను స్థానికులు నిలదీశారు. తమ భూములు తీసుకుని పరిహారం ఇవ్వలేదని మూలపేట గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ క్రమంలో నిలదీసిన మహిళలను మంత్రి అనిత కట్టడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో, అక్కడ గందరగోళు పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. -
ఇంటికి తాళం వేసి పరారైన భర్త
నెల్లూరు : నెల్లూరు జిల్లా మూలాపేటలో శనివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్యతోపాటు తొమ్మిది నెలల చిన్నారిని బయటపెట్టి ఇంటికి తాళం వేసి పరారైయ్యాడు ఓ ప్రబుద్ధుడు. దాంతో బాధితురాలు ఇంటి బయట ఆందోళనకు దిగింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... స్థానికంగా ఆర్టీసీలో పని చేస్తోన్న కండెక్టర్ భార్యను కాన్పు కోసం పుట్టింటికి పంపాడు. అనంతరం మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే కండెక్టర్ భార్య పాపకు జన్మ నిచ్చి... తొమ్మిది నెలలు గడిచిన ... ఆమెను పుట్టింటి నుంచి ఇంటికి తీసుకురాలేదు. దాంతో ఆమె కుమార్తెతో శనివారం మూలాపేటలోని ఇంటికి వచ్చింది. అయితే కుమార్తెకు అనార్యోగంతో ఉండటంతో పాపను తీసుకుని మందుల కోసం మెడికల్ షాపుకు వెళ్లింది. అదే అదనుగా భావించిన భర్త... ఇంటికి తాళం వేసి పరారైయ్యాడు. దాంతో అతడి భార్య ఇంటి ముందు చిన్న పాపతో నిరసనకు దిగింది.


