అన్ని సీట్లలో పోటీ చేయదట.. టీడీపీపై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు | YCP MP Vijayasai Reddy Tweet On TDP - Sakshi
Sakshi News home page

అన్ని సీట్లలో పోటీ చేయదట.. టీడీపీపై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు

Oct 17 2023 2:49 PM | Updated on Oct 17 2023 3:05 PM

Ysrcp Mp Vijayasai Reddy Tweet On Tdp - Sakshi

సాక్షి, తాడేపల్లి: ‘తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లలో పోటీ చేయదట. క్యాండిడేట్లు దొరకడం లేదని అనుకోవాలా?’ అంటూ ట్విట్టర్‌ వేదికగా టీడీపీకి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు.

‘‘87 సీట్లలో మాత్రమే అభ్యర్థులను నిలబెడతామని అక్కడి పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. తెలంగాణ ప్రాంతానికి కూడా చంద్రబాబు గారు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నారు. ఏపీలో పచ్చ పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

‘‘వీళ్లు చేసే ‘సంకెళ్ల’ ఫోటోషూట్, లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించే ‘సెలెబ్రేషన్స్’ ప్రజలకు చంద్రబాబు గారు చేసిన స్కాంల గురించి అవగాహన పెంచుతున్నాయి. నిరసన పేరుతో వీళ్లు డ్రామాలు చేసిన ప్రతిసారి ఒక వర్గం వాళ్లే తల్లడిల్లిపోతున్నారు. బాబు గారి జైలు పుణ్యాన వీళ్ల అసలు రూపాలు బయట పడ్డాయి’’ అంటూ మరో ట్విట్‌లో విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement