
సీమెన్స్‌తో ఒప్పందం అని చెప్పి, అనేక షెల్ కంపెనీల పేర్లతో డబ్బును మళ్లించారు. సత్యహరిశ్చంద్రుని తర్వాత నేనే అని చెప్పుకునే చంద్రబాబు భారీ స్కాంలకు పాల్పడ్డారు.
సాక్షి, తాడేపల్లి: స్కాం స్టార్‌గా చంద్రబాబు మారిపోయారంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగాల పేరుతో యువతని దగా చేశారని, వారి పేరుతో రూ.372 కోట్లు దోచేశారని ఆయన మండిపడ్డారు.
సీమెన్స్‌తో ఒప్పందం అని చెప్పి, అనేక షెల్ కంపెనీల పేర్లతో డబ్బును మళ్లించారు. సత్యహరిశ్చంద్రుని తర్వాత నేనే అని చెప్పుకునే చంద్రబాబు భారీ స్కాంలకు పాల్పడ్డారు. అవినీతికి పాల్పడితే రోడ్డుపై ఉరి తీయమన్న చంద్రబాబు.. ఇప్పుడు ఏం మాట్లాడతారు?. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో యువతని కూడా మోసం చేశారు. ఇలాంటి మోసాలు చేసే వ్యక్తి సింహాసనం మీద ఎలా కూర్చుంటారు?’’ అని ఎంపీ మార్గాని ప్రశ్నించారు.
‘‘తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు. పోలవరాన్ని ఎలాంటి టెండర్ లేకుండా నామినేషన్ మీద కాంట్రాక్టు ఇచ్చారు. ఫలితంగా వందల కోట్లు ముడుపుల రూపంలో దోచుకున్నారు. స్కిల్ కేసులో ఇప్పటికే షెల్ కంపెనీల ఓనర్లంతా చంద్రబాబుకే డబ్బు చెల్లించినట్టు చెప్పారు. ఇక చంద్రబాబుకు నూకలు చెల్లాయి. విభజన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి భారీగా స్కాంలు చేశారు. రాజధాని పేరుతో అమరావతిలో స్కాం చేశారు. ఈ కేసులో ఉన్న ఇద్దరు నిందితులు పారిపోయారు. ఇంటర్ పోల్ సహాయంతో వారిని కూడా అరెస్టు చేస్తాం. రాత్రికి రాత్రే చంద్రబాబు పరార్ కావాలని చూశారు. సీఐడీ వాళ్లు చాకచక్యంగా వ్యవహరించి అరెస్టు చేశారు’’ అని మార్గాని భరత్ పేర్కొన్నారు.
చదవండి: ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు బాబుగారి ప్లాన్!
‘‘స్కిల్ స్కాంలో వచ్చిన ముడుపుల్లో పవవ్‌కి కూడా వాటాలు అందే ఉంటాయి. అందుకే చంద్రబాబు మీద తెగ ప్రేమ చూపుతున్నారు. అమరావతి కేసులు, ఫైబర్ నెట్ కేసులో కూడా విచారణ త్వరగా చేయాలి. స్కాంలు చేసిన వారిని చూస్తూ ఊరుకోవాలా?. చంద్రబాబును అరెస్టు చేస్తే టీడీపీ వారు బలవంతంగా షాపులు మూయిస్తున్నారు. షాపు ఓనర్లను చెంపమీద కొడుతూ షాపులు మూయించటం సోషల్ మీడియాలో చూశాం. ఇలాంటి రౌడీయిజం చేస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. లోకేష్ పాత్ర ఉందని తేలితే ఆయన్ని కూడా అరెస్టు చేస్తారు. చట్టానికి ఎవరూ అతీతం కాదు’’ అని ఎంపీ మార్గాని భరత్ తేల్చి చెప్పారు.