సాక్షి, విశాఖపట్నం: కూటమి పాలనలో పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. చంద్రబాబు, అనిత వల్లే పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. మూడు సింహాల పోలీసులు.. మూడు పార్టీలకు తొత్తులుగా మార్చారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో పోలీసు వ్యవస్థలను చంద్రబాబు, లోకేస్ భ్రష్టు పట్టించారు. కూటమి పాలన అవినీతికి కేరాఫ్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. ప్రజల రక్షణ కోసం పోలీసులను ఉపయోగించడం లేదు. మన పోలీసు శాఖకు వందకి 16.70 పాయింట్స్ వచ్చాయి. మన పోలీసు వ్యవస్థ అన్ని రంగాల్లో పతనం అయ్యింది. కేంద్ర హోం శాఖ ఇచ్చిన నివేదిక ద్వారా వివరాలు అన్నీ వెల్లడయ్యాయి.
జగన్ పాలనలో మన హోం శాఖ 85 అవార్డులు సంపాదించింది. కేంద్రం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఏపీ చివరిలో ఉంది. ర్యాంకింగ్స్‌లో 36వ స్థానంలో ఉన్నాం.. ఇదేనా మంచి ప్రభుత్వం. ఇది బ్యాడ్ గవర్నెన్స్. కూటమి మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం. పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్‌కు చంద్రబాబే కారణం. ఏపీ పోలీస్ వ్యవస్థ తీరు సిగ్గుచేటు. చంద్రబాబు, అనిత వల్లే పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది. పోలీసులు ఖాళీ దుస్తుల బదులుగా.. ఎల్లో దుస్తులు వేసుకుంటున్నారు. మూడు సింహాల పోలీసులు.. మూడు పార్టీలకు తొత్తులుగా మార్చారు. కూటమి ప్రభుత్వమే పోలీసులతో తప్పులు చేయిస్తోంది. పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్‌కు చంద్రబాబే కారణం. జగన్ పాలనలో మన పోలీసులు పక్క రాష్ట్రాలకు వెళ్లినా తలెత్తుకు తిరిగే వారు.
బిహార్ లాంటి రాష్ట్రం కూడా 15వ స్థానంలో ఉంటే.. మన రాష్ట్రం అట్టడుగున ఉంది. తప్పులను సరిదిద్దే పోలీసులతో ఈ పాలకులు తప్పులు చేయిస్తున్నారు. హోమ్ మంత్రి అనిత అసమర్థ పాలన వలన పోలీసు శాఖ పతనం అయ్యింది. ఐపీఎస్‌ని ఇండియన్ పనిష్‌మెంట్ సర్వీస్‌గా మార్చారు. కూటమి పాలనలో అందరూ పోలీసులను తిట్టుకుంటున్నారు. బాబు అసమర్థ పాలన వలన పోలీసు వ్యవస్థ దిగజారింది. సీఎం, హోం మంత్రి అందరూ డమ్మీలే. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలను అరికట్టడంలో ఫెయిల్ అయ్యారు. గంజాయి, నకిలీ మద్యం నిర్మూలనలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. కోర్టు ప్రొసీడింగ్స్‌ను రికార్డ్ చేయడం టీడీపీ దిగజారుడు తనానికి నిదర్శనం. సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టింది చంద్రబాబు, సోనియాగాంధీ. చంద్రబాబు మీద కేసులు లేవా?. అసమర్థ పాలనకు కారకులైన చంద్రబాబు, హోం మంత్రి తక్షణం రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు.


