బాబూ.. ఛార్జీలు పెంచడం సంపద సృష్టా?: వరుదు కల్యాణి | YSRCP MLC Varudhu Kalyani Serious Comments On CBN Govt | Sakshi
Sakshi News home page

బాబూ.. ఛార్జీలు పెంచడం సంపద సృష్టా?: వరుదు కల్యాణి

Dec 1 2024 7:39 PM | Updated on Dec 1 2024 7:39 PM

YSRCP MLC Varudhu Kalyani Serious Comments On CBN Govt

సాక్షి, విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసానికే బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. కొండనాలిక మందేస్తే ఉన్న ఉన్న నాలుక ఊడినట్లు ప్రజల పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తామని చెప్పి విద్యుత్ చార్జీలు పెంచడం దారుణమన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విద్యుత్ ఛార్జీల పెంపుదల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రజలపై భారం మోపితే చూస్తూ ఊరుకోం. ప్రజల తరఫున పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే నిత్యవసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి.. ఇప్పుడు ప్రజలపై భారం మోపడం దుర్మార్గం. సంపద సృష్టిస్తామని చెప్పి విద్యుత్ చార్జీలు పెంచి సంపద సృష్టిస్తున్నారు. ఆర్థికంగా రాష్ట్ర అభివృద్ధి చేస్తామని చెప్పి చంద్రబాబు కరెంట్ చార్జీల పేరుతో రూ.15 వేల ‌కోట్ల రూపాయలను ప్రజలపై భారం మోపారు’ అని మండిపడ్డారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement