దండుపాళ్యం ముఠా నాయకుడు లోకేష్‌: ఎమ్మెల్యే టీజేఆర్‌ | Sakshi
Sakshi News home page

దండుపాళ్యం ముఠా నాయకుడు లోకేష్‌: ఎమ్మెల్యే టీజేఆర్‌

Published Sat, Dec 2 2023 11:42 AM

Ysrcp Mla Tjr Sudhakar Babu Fires On Nara Lokesh - Sakshi

సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ భాషని బట్టి అతని స్థాయిని గుర్తించవచ్చని.. తండ్రిని అరెస్టు చేయగానే ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్ అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏ నియోజకవర్గం వెళ్తే ఆ ఎమ్మెల్యేని, కుటుంబ సభ్యులను దూషించటం కరెక్టు కాదన్నారు.

 సుధాకర్ బాబు ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..

లోకేష్ మనిషా..? పశువా?:
లోకేష్ భాషను బట్టి అతని స్థాయిని అంచనా వేయొచ్చు. పాదయాత్ర మధ్యలో ఆపి ఢిల్లీ పారిపోయి, దాక్కొని మళ్ళీ వచ్చి పాదయాత్ర చేయడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు అని ఎన్నిసార్లు ప్రశ్నించినా లోకేష్ నుంచి సమాధానం లేదు. లోకేష్ పాదయాత్ర చేసినా, మోకాళ్ళ యాత్ర చేసినా, పొర్లుదండాల యాత్ర చేసినా, పాక్కునే, దాక్కునే యాత్ర చేసిన మాకు అభ్యంతరం లేదు. కానీ, లోకేష్ ఏ నియోజకవర్గం వెళ్లినా అక్కడి శాసనసభ్యుడిని టార్గెట్ చేసి, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, దారుణమైన మాటలతో కుటుంబాల్ని దూషిస్తూ మాట్లాడుతున్నారు.

అలాగే ప్రజలచే ఎన్నుకోబడి, మహానాయకుడిగా ఎదిగిన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని అసభ్యపదజాలంతో మాట్లాడుతున్నారు.. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. మీ నాన్న, మీ తాతలు సీఎంలగా పనిచేశారు.. ఇద్దరు సీఎంలుగా పనిచేసిన కుటుంబం నుంచి వచ్చి.. రోడ్ల మీదకు వచ్చి మాట్లాడేటప్పుడు కనీస జ్ఞానం ఉండాలిగా లోకేష్. లోకేష్ మనిషా..? పశువా.? కొవ్వు కరిగించికుని సన్నబడి అచ్చోసిన ఆంబోతులా రోడ్ల మీద పడి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. 

బుద్ధిలేని లోకేష్ నోటికి పనిపెడుతున్నాడు
ఏదైనా అంశం మీద చర్చించాలనుకున్నా, ప్రభుత్వ లోపాలను చెప్పాలన్నా లేదా ఆయా నియోజకవర్గాల్లో ప్రజల సమస్యల మీద గళమెత్తి మాట్లాడాలనుకుంటే.. మేం రెడీగా ఉన్నామని పదే పదే చెప్తున్నాం...కానీ బుద్ధికి పనిపెట్టాల్సిన లోకేష్ నోటికి పనిపెడుతున్నాడు.. అది నోరా? మున్సిపాలిటీ చెత్తబుట్టా? లోకేష్ నోటిని ఎన్ని ఫినాయిల్ బాటిళ్ళతో కడిగినా శుద్ధి కాదని పదే పదే నిరూపిస్తున్నాడు.రోడ్ల మీదకు వచ్చి ఆంబోతులా అరిచేవాడిని, గాడిదలా వాగేవాడిని, కుక్కులా మొరిగేవాడిని.. పనికిమాలినవాడని, దేనికీ పనికిరాని పప్పు అని సమాజం గుర్తిస్తుంది.

ప్రజాక్షేత్రంలో ఒక్క ప్రత్యక్ష ఎన్నికలో కూడా లోకేష్ గెలవలేదు, ప్రజలచే ఎన్నుకోబడలేదు, మంగళగిరిలో ప్రజలు తిరస్కరించారు.. అటువంటి నువ్వు రాష్ట్రానికి చేసేది ఏంటి లోకేష్?. ఒక మాట అనే ముందు అవతల వ్యక్తి స్థాయిని గుర్తించి నీ బుద్ధికి పదునుపెట్టు. మసిపూసుకుపోయిన నీ మనస్సుతో స్థాయి మరచి మాట్లాడితే తగిన బుద్ధిచెబుతాం. నువ్వు దొంగవి, నీది దొంగ పార్టీ, దండుపాళ్యం ముఠా మీది, జన్మభూమి కమిటీల పేరుతో దారి దోపిడీ దొంగల ముఠాల్లా గ్రామాల మీద పడి దోచుకుంది మీరు కాబట్టి.. అటువంటి మీ నుంచి, మీ దోపిడీల నుంచి రాష్ట్రాన్ని కాపాడి ప్రజా నాయకుడిగా ముఖ్యమంత్రిగారు పరిపాలిస్తున్న విధానాన్ని చూసి ఓర్చుకోలేక నోటికి పనిపెడతారా.?

దేనిమీద చర్చిద్దాం బోకేష్
అసలు మీ టీడీపీ హయాంలో ఏం చేశారని, మీ దగ్గర ఏముంది చెప్పకోవడానికి.. లోకేష్ అన్నట్లే వ్యవసాయ రంగం మీదే చర్చిద్దాం ఒక గంట కాదు.. రోజంతా మాట్లాడదాం.. 2014-19 టీడీపీ హయాంలో వ్యవసాయానికి మీ నాన్న ఏం వెలగపెట్టాడో, ఏం మేలు చేశారో.. గౌరవ ముఖ్యంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో వ్యవసాయానికి మేం ఎన్ని మేళ్ళు చేశామో చర్చిద్దాం.

రూ.5వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి పెడతామని రైతుల నోట్లో మట్టికొట్టిన దొంగ మీ నాన్న చంద్రబాబు కాదా? మీ పార్టీ కాదా? పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులను రోడ్లమీదకు తెచ్చిన రైతు ద్రోహుల చరిత్ర మీది కాదా? వ్యవసాయం దండగ అన్నది మీ నాన్న కాదా? రైతుల భూములను అక్రమంగా లాక్కొంది మీరు కాదా? నాసిరకం విత్తనాలను గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల మిర్చి రైతులకు పంపిణీ చేసి వేల ఎకరాల పంటను నాశనం చేసిన దుర్మార్గులు మీరు కాదా? పోలవరం నిర్మాణం డబ్బులను, మీ బినామీ కాంట్రాక్టర్లుకు దోచిపెట్టి, దోచుకున్న దండుపాళ్యం ముఠా మీరు కాదా? ఏ ఒక్కరోజైనా వ్యవసాయ రంగాన్ని పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? మీ నాన్న చంద్రబాబు రూ.86వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని చేయకుండా రైతులను మోసం చేసిన దొంగలు మీరు బోకేష్.

మా హయాంలో రైతు భరోసా సకాలంలో ఇస్తున్నాం. మేలు రకాల విత్తనాలు సకాలంలో పంపిణీ చేశాం. ఆర్బీకే సెంటర్లు పెట్టాం.  విత్తన శుద్ధి కార్యక్రమాలు  చేస్తున్నాం. ఖరీఫ్ సీజన్‌ల ఏం పంటకు ఎంత ధర ఇవ్వబోతున్నామో ముందుగానే ప్రకటించిన ప్రభుత్వం మాది. పండించిన ప్రతి గింజనూ కొంటున్నాం.. రైతులు గుండె మీద చెయ్యివేసుకుని తిరుగుతున్నారు. జగన్ గారు హాయంలో రాష్ట్రంలోని నదులు, ప్రాజెక్టులు నీళ్ళతో నిండి కళకళలాడుతున్నాయి. మద్దతు ధరలు ఇచ్చిన ప్రభుత్వం మాది. వ్యవసాయ రంగానికి మీ హయాంలో తూట్లు పొడిస్తే.. వ్యవసాయ రంగాన్ని ఆదుకున్న మహానుభావుడు జగన్ గారు. ప్రజలందరూ జగన్ గారి సుపరిపాలన చూసి హర్షిస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారు

వేస్ట్ ఫెలో...నువ్వెంత, నీ బతుకెంత?
ముఖ్యమంత్రిగారిని విమర్శించే ముందు నీ వెనుకున్న నలుపంతా చూసుకో. గురివింద గింజ సామెతలా నీకింద నలుపు పెట్టుకుని సీఎంగారిని దుర్భాషలాడతావా? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఏమిటి? విదేశాల్లో మద్యం సేవిస్తూ, అమ్మాయిలతో తిరిగిన నువ్వా మాట్లాడేది.. ఎవరో డబ్బులు కడితే చదువుకున్నావు.. కార్పొరేటర్ గా, సర్పంచ్ గా, వార్డు నెంబర్ గా గెలవలేని నువ్వు... 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలతో దమ్మూధైర్యంగా పాలిస్తున్న నాయకుడి ముందు ఏంటి మాట్లాడేది. కండకావరంతో బలిసి కొట్టుకుంటున్న నిన్ను ఇంట్లో భరించలేక మీనాన్న రోడ్లమీదకు వదిలేడు.. అసలు మీకార్యకర్తలే నిన్ను తిడుతున్నారు.. నువ్వు పెద్ద వేస్ట్ ఫెలోవని, నీవల్ల పార్టీకి ఏ ఉపయోగం లేదని, నీవల్ల ఒక్క ఓటు రాకపోగా, పార్టీని నాశనం చేస్తున్నావని తిడుతున్నది నిజం కాదా...

2024లో ప్యాకప్ అని మాట్లాడుతున్నాడు.. లోకేష్ కు దమ్ముంటే.. నిజంగా ఎన్టీఆర్ మనవడు, చంద్రబాబు కొడుకువే అయితే ఛాలెంజ్ మీద నిలబడు. సిగ్గుశరం లేక బ్యాక్ డోర్ నుంచి వచ్చి ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా గెలవలేని దద్దమ్మలా మాట్లాడకు. రేపు ఎలెక్షన్ లో దమ్ముంటే గెలువు చూద్దాం.. 2024 ఎన్నికల్లో ఎవరు ప్యాకప్.. ఎవరు రాష్ట్రంలో ఉంటారో.. ఛాలెంజ్ చెయ్, ప్రమాణం చెయ్.. మా పార్టీ అధికారంలోకి రాకపోతే నాలాంటివాళ్లం రాజీనామా చేసి వెళ్ళిపోతాం.. నీ పార్టీ అధికారంలోకి రాకపోతే మీ పార్టీ షట్టర్ మూస్తావా? ఎలాగో ప్రజలకు మీ పార్టీ దుకాణం మూసేశారు.

వెన్నుపోటు వీరుడు-స్కిల్ దొంగ చంద్రబాబు
లోకేష్, ప్యాకేజీ స్టార్ టికెట్లు అమ్ముకోవడానికే రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారు, కులాల మధ్య కుంపటి రాజేస్తున్నారు, కేవలం కులాల్ని, ప్రాంతాల్ని, వ్యక్తుల్ని, రెచ్చగొట్టి మనోభావాలు దెబ్బతీసి, ఏదోరకంగా అధికారంలోకి రావాలనే ఆరాటం మీది. అధికార ఆరాటం మీదైతే.. ప్రజా పోరాటం మాది.. ప్రజల కోసం ఏదైనా చేయాలనుకునే నాయకుడు, ప్రజల కోసం ఎంతవరకు అయినా పోరాడే నాయకుడు, ప్రజల కోసం మంచి చేసి వారి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకుడిని ఎదుర్కోలేక చెత్త మాటలు మాట్లాడతారా?

ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ప్రజలచే ఎన్నుకోబడిన మా ప్రజా నాయకుల్ని పట్టుకుని ఒక్కసారి కూడా ఎన్నికల్లో గెలవలేని రోడ్ సైడ్ వాడివి నువ్వు ఏంటి మాట్లాడేది. గౌరవ మంత్రులను పట్టుకుని వ్యంగ్యంగా మాట్లాడతావా? నీ బతుకు ఏంటి లోకేష్? వెన్నుపోటు వీరుడు మీ నాన్న కాదా? అసలు టీడీపీకి, నీకు సంబంధం ఏంటి లోకేష్? టీడీపీకి వారసులు నందమూరి కుటుంబం కాదా..? టీడీపీలో నీకు ఏం హక్కు ఉంది? నువ్వు నారావారి పార్టీ అని పెడితే సమాజం ఒప్పుకుంటుంది. 

వెన్నుపోటు వీరుడు, స్కిల్ దొంగ మీ నాన్న చంద్రబాబు. మీ నాన్న దొంగ కాబట్టే కోర్టు జైల్లో పెట్టింది, రిమాండ్ కు ఇచ్చారు. 53 రోజులు జైల్లో ఉన్నాడు, ఇప్పుడు బెయిల్ పై ఉన్న నిందితుడు మీ నాన్న. మీ నాన్నను జైల్లో పెట్టాల్సిన పైశాచిక ఆనందం మాకు లేదు. మేము నిజాయితీగా, ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం క్షణం తీరిక లేకుండా గౌరవ ముఖ్యమంత్రిగారి అడుగుజాడల్లో ప్రజాక్షేత్రంలో 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలందరూ గడపగడపకు,  సురక్ష, ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలతో పూర్తిగా ప్రజల మధ్య ఉన్నాము.. మీరు ఏసీ రూమ్ ల్లో, జైల్లో, హైదరాబాద్ లో ఉన్నారు, నువ్వు అయితే ఢిల్లీలో దాక్కున్నావు. 

సీఎంని తిట్టి నాయకుడివి అవ్వాలనుకుంటున్నావా?
అచ్చోసిన ఆంబోతు అచ్చెన్న పార్టీ లేదు బొక్క లేదంటే ఈ రోజు వరకు చర్య తీసుకోలేని అసమర్థ  పార్టీ మీది.. మీదో పార్టీ నువ్వో నాయకుడివి.. నువ్వు మా గురించి మాట్లాడతావా. లంగా ఉమా.. పోలవరం నిర్మాణంలో దోచుకున్న దొంగ, మీది దండుపాళ్యం ముఠా. ఇసుక దొంగ చింతమనేని ప్రభాకర్ మీ పార్టీవాడే, మహిళా ఆఫీసర్లను కొట్టాడు. రింగ్ రోడ్డు స్కాం మీదే, స్కిల్ స్కాం మీదే, ఫైబర్ నెట్ స్కాం మీదే. స్కామ్ వీరులు మీరు అయితే .. దొంగలే వచ్చి దొంగ.. దొంగ.. అని అరిచి ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయాలనుకుంటున్నారు, మీ ఆటలు చెల్లవు. ఆధారాలతో సహా దొరికి, జైలుపాలై దాన్ని కడుక్కోవడానికి రోడ్డుమీద పడి సీఎంగారి మీద దుర్బాషలాడితే నువ్వు నాయకుడివి ఎలా అవుతావు లోకేష్? నీకు ఈ రాజకీయం ఎవరు చెప్పారు? మీ నాన్న ఏం నేర్పలేదా? సీఎంగారిని పట్టుకుని ఆ విధంగా మాట్లాడితే జనం ఛీ అని ఉమ్మేస్తారనే సిగ్గు కూడా లేదా? సీఎంగారిని తిట్టి నాయకుడివి అవ్వాలనుకుంటున్నావా? 

ఊపుకుంటూ ఒళ్లు కరిగించుకోవడానికి తిరుగుతున్నావా? నువ్వు.. నీ వేషం.. నీదీ ఓ బతుకు...  లోకాన్ని చదవలేని, కనీస జ్ఞానం లేని వ్యక్తి లోకేష్ నీ భాష మార్చుకో. సీఎంగారిని పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడడానికి నీ వయసు ఎంత? నువ్వెంత? నీ జీవితం ఎంత? చివరి వార్నింగ్ ఇదే లోకేష్.. చెప్పుతెగేలా కొట్టిస్తాం...
 
జగన్ గారి పాలనలో అభివృద్ది, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. జగన్ గారి పాలనలో ఇండియన్ పీనల్ కోడ్ సక్రమంగా అమలవుతోంది. గుడ్ గవర్నెన్స్ జరుగుతోంది.. ఇది ప్రజా ప్రభుత్వం. మేము ఎక్కడా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయలేదు, ఒక్క రూపాయి అవినీతి లేకుండా డీబీటీ ద్వారా పథకాలు ఇస్తున్నాం. మీలా రాజధాని పేరుతో భూములు కొల్లగొట్టలేదు, మీలా లేని ఆడాంబరాలు చూపించలేదు, మీలా గ్రాఫిక్ మాయాజాలం చూపించలేదు.

పది కారణాలు చెప్పగలవా పవన్ కల్యాణ్?
సీఎం జగన్‌ని ఎందుకు ఓడించాలో.. పది కారణాలు చెప్పు పవన్ కల్యాణ్.. మేము ఎందుకు ఓడిపోవాలి.. ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తున్నందుకా? రైతు భరోసా ఇస్తున్నందుకా? అమ్మ ఒడి, చేయూత, ఆసరా.. ఇస్తున్నందుకా? ప్రజల్ని ఆదుకుంటున్నందుకా? గిట్టుబాటు ధరలు, బిడ్డలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నందుకా? నువ్వు చేసే న్యాయం సినిమా ఇండస్ట్రీలో చెయ్.. మీ కుటుంబం అంతా సినీ ఇండస్ట్రీలో ఉన్నారుగా.. అక్కడ ఉన్న కార్మికుల్ని ఆదుకోండి, అన్ని కులాల వారిని రానివ్వండి.. అని సుధాకర్ బాబు హితవు పలికారు. 

చదవండి: ఏపీ రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్‌ ఎంత? 

Advertisement
Advertisement